Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె, ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే..? రోజూ గోధుమ జావ తాగితే?

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఈ చిట్కాలు పాటించాలి. అప్పుడు అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం. వేడి నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతారు. ఒక గ్లాసు నీటి

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (17:51 IST)
ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఈ చిట్కాలు పాటించాలి. అప్పుడు అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం. వేడి నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతారు. ఒక గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, కొద్దిగా మిరియాలు వేసి మరిగించాలి. ఈ నీటిని ఉదయాన్నే తాగడం ద్వారా శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్యాలు దరిచేరవు.
 
ప్రతి రోజు అల్లంతో టీ తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. ఇంకా గోధుమ జావ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే.. ఒక స్పూన్ తేనేలో చిటికెడు కుంకుమపువ్వు కలుపుకుని తీసుకుంటే సరిపోతుంది.ఇలా చేస్తే చర్మానికి ప్రత్యేక నిగారింపు సంతరించుకుంటుంది.
 
రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే క్రమంగా చర్మం కాంతిమంతమవుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. రోజుకి మూడు, నాలుగు సార్లు తులసి ఆకులను నమలాలి. నమిలితే వచ్చే రసాన్ని మింగడం వల్ల శరీరానికి మంచిది. ఇక 
 
ఉదయం, సాయంత్రం వేళల్లో పూట కొద్దిసేపు తప్పనిసరిగా నడవాలి. ఇలా చేయడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలలో భూప్రకంపనలు: ఇలాంటి ఘటనల తర్వాత మన ఇళ్లు ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?

మైనర్ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం...

నెల్లూరు రేషన్ బియ్యం స్వాధీనం.. స్టెల్లాలో అధికారుల తనిఖీలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తర్వాతి కథనం
Show comments