Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నబడాలంటే రోజుకి 3 కప్పులు చిక్కుడు కాయలు తినండి!

Webdunia
బుధవారం, 30 మార్చి 2016 (09:57 IST)
చిక్కుడులో బోలెడు సుగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సన్నబడాలని ఆశపడేవారు చిక్కుడును ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. 
 
ప్రతి వంద గ్రాముల చిక్కుడు కాయల్లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది. ముఖ్యంగా శరీరం బరువు తగ్గాలని డైటింగ్‌ చేసేవారు చిక్కుడును ఎక్కువగా తింటే మంచిది. అరకప్పు చిక్కుడులో 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. చిక్కుడును కూరల్లోనే కాకుండా సూపులు, ఇతర టిఫిన్ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో బీ-కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లు కూడా లభిస్తాయి. 
 
అంతేకాదు మన కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు వంటి భాగాలకు చిక్కుడు చక్కటి శక్తిని అందిస్తుంది. అలాగే వరి అన్నం తీసుకునే షుగర్ రోగులు అన్నంకన్నా చిక్కుడు శాతం ఎక్కువగా తీసుకుంటే 25 శాతం డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. 
 
చిక్కుడును వారంలో కనీసం మూడుకప్పులు తినగలిగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలని పోషకాహార నిపుణులు తెలిపారు. చిక్కుడులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో తయారయ్యే క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. గుండెచుట్టూ కొలెస్టరాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ పెరగకుండా చూస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

Show comments