Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా.. అయితే చాలా నష్టమే జరుగుతుందట!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (08:50 IST)
టిఫిన్ తినడం మానేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి చాలా నష్టమే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే హడావుడిగా అల్పాహారం తీసుకోకుండా ఆఫీసులకు వెళ్లిపోతున్నారా.. పిల్లలు కూడా స్కూలుకు టైమ్ అయిపోతుందని టిఫిన్ తినకుండా వెళ్తున్నారా.. అయితే మీ ఆరోగ్యానికి దెబ్బేనని నూట్రీషన్లు అంటున్నారు. 
 
అల్పాహారం మానేసేవారిలో గృహిణులే అధికం. ఉదయాన్నే ఇంటిపనుల్లో తీరికలేకుండా ఉండడం, ఇంట్లోనే ఉంటాంకదా పొద్దుట పూట తినడం దేనికి అని వీరు పొద్దున తినడం మానేస్తుంటారు. రోజు మొత్తంలో ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం ప్రాముఖ్యత ఎక్కువ. 
 
అల్పాహారంపై జరిపిన అధ్యయనంలో 9-11 సంవత్సరాల వయసుగల విద్యార్థులలో ఉదయాన్నే అల్పాహారాన్ని మానేసిన పిల్లలు అల్పాహారం తీసుకొనే పిల్లల కంటే ఆటల్లో వెనకబడి ఉన్నారని, వీరిలో వెంటనే స్పందించే గుణం కూడా తక్కువ ఉందని తేలింది. 
 
అలాగే ఉదయాన్నే అల్పాహారం తీసుకోని ఉద్యోగస్తులు తీసుకున్న వారితో పోలిస్తే పనిమీద ఏకాగ్రత నిలపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని, పని విషయంలోనూ అంత నైపుణ్యాన్ని చూపించలేరని వీరు చెబుతున్నారు.
 
ఉదయపు అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి ఏర్పడే పోషకలేమి మధ్యాహ్నం పూట చేసే భోజనంతోగానీ, రాత్రిపూట కడుపుపగిలేలా తినే తిండితో కానీ పూర్తికాదు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments