కవర్లలో భద్రపరిచే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే..?

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (11:22 IST)
నేటి తరుణంలో ఇంట్లో చేసే ఆహార పదార్థాలకంటే.. బయటదొరికే ఫాస్ట్ ఫుడ్స్‌ ఎక్కువగా తింటున్నారు. అయితే వాటిని భద్రపరిచే వ్రాపర్స్‌తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. అలానే ఈ ఫాస్ట్ ఫుడ్స్ భద్రపరిచే కవర్లు, ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాల ద్వారా మనం తీసుకునే పదార్థాలు అనారోగ్యాలను కొనితెచ్చిపెడుతున్నాయని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. 
 
ఈ ఫుడ్స్ భద్రపరిచేందుకు ఉపయోగించే వ్రాపర్స్‌‌లో టాక్సిన్స్, కార్సినోజెనిక్ టెప్లన్ కెమికల్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని స్పష్టం చేశారు. ఈ విషయం ఫాస్ట్ ఫుడ్స్ ప్యాక్ చేసే పేపర్లు, ప్లాస్టిక్ పదార్థాలను పరిశోధించడంతో వెలుగులోకి వచ్చిందని పరిశోధకులు అంటున్నారు. వ్రాపర్స్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాల ద్వారా క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్తున్నారు. 
 
జంక్ ఫుడ్స్‌తోనే కాదు.. జంక్ ఫుడ్స్‌ను భద్రపరిచే ప్యాకెట్లతోనూ ఆరోగ్యానికి కీడు జరుగుతుందని.. అందుకే వాటిని తీసుకోవడం చాలామటుకు తగ్గించడం మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్, డెసర్ట్స్, బర్గర్లు, పిజ్జాలను ప్యాక్ చేసే వ్రాపర్స్ ద్వారా వాటిని ఆహారంగా తీసుకునే మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. ఇందుకు వాటి తయారీకి పీఎఫ్‌ఓఎస్, టాక్సిక్ సబ్‌స్టన్న్ అనే రసాయనాలు ఉపయోగించడమే కారణమని పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఈ రసాయనాలతో తయారైన కవర్లలో భద్రపరిచే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే.. మెదడు పనితీరు మందగిస్తుంది. కాలేయం, ఉదరం, ఊపిరితిత్తులు, గర్భాశయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఇంకా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం, థైరాయిడ్ వంటివి తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments