Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరైన సమయానికి భోజనం చేయకపోతే..?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:28 IST)
సమయం సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం చేస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వలన కడుపులో క్రమక్రమంగా గ్యాస్‌ సమస్య పెరిగి, శరీరపటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
 
బలీమియా, బింగీ వ్యాధులకు చాలా సారూప్యత ఉంది. కానీ ఈ రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాధి సోకడం వలన శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి.
 
అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనషులను శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులు మనుషులపై ఏయే ప్రభావాలు చూపుతాయే ఒక్కసారి పరిశీలిద్దాం.
 
అనోరెక్సియా వ్యాధికి గురైన వ్యక్తి తన సాధారణ శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుంది. ఓ క్రమపద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం మహిళలో రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
 
ఇకపోతే బింగీ వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి ఫలితాలనే చూపిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది. కొందరు యువతీయువకులు తమ శరీరాలను నాజూగ్గా ఉంచుకోవడానికి కడుపు మాడ్చుకుంటుంటారు. ఇలా చేయడం వలనే ఈ వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయని వైద్యు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాబట్టి ఎన్ని పనులున్నా సమయానికి కడుపు నిండా భోంచేసి ఆరోగ్యాంగా ఉండండని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments