Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు ఎప్పుడైనా ఊలాంగ్ టీ తాగారా?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (16:19 IST)
ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల టీలు లభిస్తున్న సంగతి తెలిసిందే. అందుబాటులో ఉన్న ప్రతి టీ మనకు ఏదో ఒక రకమైన ఆరోగ్యకర ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. అయితే అలాంటి ఆరోగ్యకరమైన టీలలో ఊలాంగ్ టీ కూడా ఒకటి. వాస్తవానికి ఇది చైనీయుల సాంప్రదాయ టీ వెరైటీ.


చాలా పురాతన కాలం నుండి చైనీయులు ఈ ఊలాంగ్ టీని సేవిస్తున్నారు. ఈ రకమైన టీ ప్రస్తుతం బాగా జనాదరణ పొందుతోంది. ఈ టీ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి మీరూ చూడండి.
 
* సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు ఊలాంగ్ టీ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.
 
* నిత్యం పని భారంతో ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే వారు ఊలాంగ్ టీ తాగినట్లయితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది.
 
* ఊలాంగ్ టీ తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఊలాంగ్ టీ సేవించడం వల్ల మన శరీరంలో కొవ్వు కరిగే రేటు 12 శాతం వరకు పెరుగుతుందట. ఇందువల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరిగి బరువు వేగంగా తగ్గుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనుక ఊలాంగ్ టీ నిత్యం తాగినట్లయితే అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చు.
 
* శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నిత్యం ఊలాంగ్ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 
* ఊలాంగ్ టీ తాగడం వల్ల మనం తినే ఆహారంలోని కొవ్వును శరీరం శోషించుకోవడం మానేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments