Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటును నియంత్రించే ఓట్స్...

ఓట్స్ ఒక మంచి పౌష్టికాహారం. దీనిలో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధికశాతంలో ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతుంది. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూప

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (09:04 IST)
ఓట్స్ ఒక మంచి పౌష్టికాహారం. దీనిలో పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధికశాతంలో ఉన్నాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతుంది. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ.. దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది. ఇవి తినడం వల్ల చాలా లాభాలు వున్నాయి. ఇంతకీ ఓట్స్ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఒక్కసారి చూద్దాం.
 
ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది. అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది.
 
ఒక 40 గ్రాముల ఓట్స్‌లో రోజుకి సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. దానివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. 
 
అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.  ఓట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

తర్వాతి కథనం
Show comments