Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో గ్లాసు పాలు తాగితే బరువు పెరగరు..

రోజుకో గ్లాసు పాలు తాగితే బరువు పెరగరని.. రోజూ కనుక పాలు తాగితే బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చునని వైద్యులు చెప్తున్నారు. పాలు తాగే వారిలో కాన్యర్ కారకాలు నశిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో త

Webdunia
బుధవారం, 26 జులై 2017 (14:50 IST)
రోజుకో గ్లాసు పాలు తాగితే బరువు పెరగరని.. రోజూ కనుక పాలు తాగితే బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చునని వైద్యులు చెప్తున్నారు. పాలు తాగే వారిలో కాన్యర్ కారకాలు నశిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. చిన్నప్పటి నుండి పాలు తాగే అలవాటు ఉన్న వారిలో రొమ్ము కేన్సర్ కలిగే అవకాశాలు తక్కువేనని వైద్యులు చెప్తున్నారు. 
 
పాలల్లో ఉండే క్యాల్షియం.. సహజ సిద్ధమైన కొవ్వు.. కాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుంది. రోజూ గ్లాసుడు పాలు తీసుకునే వారిలో టైప్-2 డయాబెటిస్ వ్యాధి గురయ్యే అవకాశాలు చాలా తక్కువని తేలింది. తక్కువ ఫ్యాట్ గల పాలలో గ్లైసిమిక్ స్థాయిలు తక్కువగా ఉండటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిలో ఉండటమే దీనికి కారణమని చెప్పారు. 
 
పాలల్లోని క్యాల్షియం వంటి ఇతరత్రా ధాతువులు గుండె జబ్బులను దూరం చేస్తుంది. పాలలో ఉండే కాల్షియం శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది. కండరాలు, దంతాలు, ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజు గ్లాసుడు పాలు సేవించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments