Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవిసె గింజలతో సంపూర్ణ ఆరోగ్యం

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (16:29 IST)
అవిసెగింజలు శక్తివంతమైన మొక్క ఆహారాలలో ఒకటని చెప్పవచ్చు. గుండె వ్యాధి, క్యాన్సర్, స్ట్రోక్, మధుమేహం వంటి ప్రమాదాలను తగ్గిస్తాయని వైద్యులు అంటున్నారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో, క్యాన్సర్‌ కారకాలతో పోరాటం చేయడంలోనూ అవిసెగింజల్లోని ప్రత్యేక పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. ఇంతటి మేలు చేసే ఈ గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దామా!
 
అవిసె గింజల్లో లభించే పోషకాలు జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలోని బి విటమిన్‌, కీలక కొవ్వులు చర్మం పొడిబారే తత్వాన్ని తగ్గించి, మృదువుగా తయారు చేస్తాయి. అవిసెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడుతుంది. తక్కువ మోతాదులో ఉండే కెలోరీలు బరువుని నియంత్రిస్తాయి. వీటిని నేరుగా తీనడానికి ఇష్టం లేనివారు సూప్‌లు, సలాడ్‌లు, స్మూతీల్లో వేసుకుని తీసుకుంటే మంచిది. వీటివల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. వీటిల్లోని పోషకాలకు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ కారకాలతో పోరాడే శక్తి ఉంది.
 
మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలకు అవిసెగింజల్లో లభించే లిగ్‌నాన్స్‌ ఎంతో మేలు చేస్తాయి. లిగ్‌నాన్స్‌కి ఈస్ట్రోజన్‌ గుణాలు అధికం. హార్మోన్ల సమతూకం సాధనకూ ఓ ఔషధంలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవిసెగింజలు తోడ్పడతాయి. రుతుక్రమం సవ్యంగా కొనసాగడంలో సాయపడతాయి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments