ఈ బాదం పప్పు వుంది చూశారూ... తింటే ఏమవుతుంది మాస్టారూ...

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (10:03 IST)
బాదం పప్పు మార్కెట్‌లో విరివిగా దొరుకుతుంది. బాదం పాలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతాయి. దీనిలోని విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. బాదం పప్పుతో పాలు ఎలా చేయాలంటే.. కప్పు బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే వాటి పొట్టు తీసి మిక్సీలో ‌మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టితే పాలు వస్తాయి. ఇందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
1. వ్యాయామం ఎక్కువగా చేసేవారు తరచుగా బాదం పాలను సేవిస్తే కండరాల నిర్మాణం సరిగ్గా జరుగుతుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది.  
 
2. బాదం పాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, క్యాల్షియం, పాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఈ పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 
 
3. హైబీపీతో బాధపడేవారికి కళ్లు తిరగడం, వాంతులు రావడం, తలనొప్పి వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఏ ఆహారం తిన్నా జీర్ణం కాదు. అందుకు రోజూ పచ్చి బాదం పప్పులను సేవిస్తే బీపీ అదుపులో ఉంటుంది.
 
4. గుండె సంబంధిత వ్యాధులు చెక్ పెట్టాలంటే.. రోజూ బాదంతో తయారుచేసిన వంటకాలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు వంటి సమస్యలు దరిచేరవు. 
 
5. మధుమేహ వ్యాధి గలవారు బాదం పాలు తీసుకోవడం అనివార్యం. ఈ పాలు తాగడం వలన శరీరానికి ఎలాంటి హానికలుగదు. ఆకలి నియంత్రణకు చాలా సహాయపడుతుంది. 
 
6. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. తద్వారా అధిక బరువు తగ్గే అవకాశం ఉంది. బాదం పప్పు పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. 
 
7. బాదం ఆరోగ్యానికి ఎలానో అందానికి అంతే.. ఎలా అంటే.. ముఖంపై నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు బాదం పప్పులను పేస్ట్‌ చేసి అందులో కొద్దిగా సోంపు, పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఇలా తరచుగా చేస్తే ముఖం మృదువుగా మారుతుంది. 
 
8. చాలామందికి వయసు తేడా లేకుండా జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చూద్దాం.. నానబెట్టిన బాదం పప్పులను పేస్ట్‌ చేసి అందులో కొద్దిగా మెంతి పొడి, పెరుగు, టమోటా రసం, కలబంద గుజ్జు, గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. ఇలా తరచుగా చేస్తే వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments