Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండిని వాడుతున్నారా? పేగులకు అవి అతుక్కుపోతాయట!

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (16:18 IST)
Maida
మైదాపిండితో ఆరోగ్యానికి కీడు తప్పదు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత‌ పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుప‌దార్థం జీరో. కాబట్టి మైదా త్వ‌ర‌గా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివ‌ల్ల పేగుల్లో పుండ్లు ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ది. అవి ముదిరితే క్యాన్స‌ర్ లాంటి తీవ్రమైన ప్రాణాంత వ్యాధుల‌కు దారితీస్తాయి. 
 
మైదా పిండిని గోడ‌ల‌కు పోస్ట‌ర్ల‌ను అంటించ‌డానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే  మైదాపిండిలోని జిగురు పోస్ట‌ర్లు గోడ‌కు గ‌ట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన ప‌దార్థాలను తిన్న‌ప్పుడే అవి మ‌న పేగుల‌కు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్ప‌త్తై ఇన్ఫెక్ష‌న్‌ల‌ను క‌లుగ‌జేస్తాయి. మైదా పిండివ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి.
 
గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ‌ సమస్యలు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండ‌టం వ‌ల్ల పొట్ట వ‌స్తుంది. ప్రొటీన్‌లు నామమాత్రంగా ఉంటాయి. అదేవిధంగా మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ‌ల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments