Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెసరట్టు వారానికి రెండు సార్లు తీసుకుంటే?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (18:46 IST)
Pesarattu
పెసళ్లను ఉడికించి తీసుకోవడం లేదంటే.. మొలకెత్తాక తీసుకోవడం చేస్తుంటాలి. లేదంటే పెసరట్టు ద్వారా పెసళ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే వేసవిలో వారానికి రెండుసార్లైనా పెసళ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఫైబ‌ర్‌, ఫోలేట్‌, మాంగ‌నీస్‌, విట‌మిన్ బి1, పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాప‌ర్‌, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి2, బి3, బి5, బి6, సెలీనియంలు ల‌భిస్తాయి. పొటాషియం గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది.
 
పెస‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీని వ‌ల్ల మ‌న‌కు వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. పెస‌ల‌ను తింటే ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. 
 
పెస‌ల్లో పొటాషియం, మెగ్నిషియం పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు పెస‌ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది. అలాగే గ‌ర్భిణీలు నిత్యం పెస‌ల‌ను తింటే ఫోలేట్ బాగా అందుతుంది. త‌ద్వారా బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుందని, సళ్లతో పెసరట్టు చేసుకోవడం ద్వారా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని.. వారానికి రెండుసార్లైనా పెసరట్టు చేసుకుని తీసుకోవాలని న్యూట్రీషియన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments