Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయం (లివర్)కు హాని చేసే ఆహార పదార్థాలేంటి?

మానవ శరీరంలో ఉండే అతిపెద్ద అవయవం కాలేయం (లివర్). ఇది చేసే పనులు ఎంతో కీలకమైనవి. నోటికి రుచికరంగా తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా.. శరీరానికి తగిన శక్తిని అందించాలన్నా దీని పనితీరు భేషుగ్గా ఉండాలి.

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (12:26 IST)
మానవ శరీరంలో ఉండే అతిపెద్ద అవయవం కాలేయం (లివర్). ఇది చేసే పనులు ఎంతో కీలకమైనవి. నోటికి రుచికరంగా తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా.. శరీరానికి తగిన శక్తిని అందించాలన్నా దీని పనితీరు భేషుగ్గా ఉండాలి. అలాగే, శరీరంలో ఉత్పత్తి అయ్యే విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా కూడా లివర్ పనితీరు ఎంతో ముఖ్యం. అలాంటి కాలేయానికి హాని చేసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా తీపి పదార్థాలంటే ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడుతారు. అయితే, చక్కెర అధింగా ఉండే పదార్థాలతో పాటు.. స్వీట్లు అధికంగా తీసుకునేవారిలో కాలేయం త్వరగా చెడిపోతుందట. చ‌క్కెరను అతిగా తీసుకోవడం వల్ల లివ‌ర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివ‌ర్ ప‌నితీరు మంద‌గించి అది చెడిపోతుంది. 
 
శీతల పానీయాలు అధికంగా తాగినా కూడా కాలేయం త్వరగా చెడిపోతుంది. కూల్‌ డ్రింక్స్‌లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పువల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే. 
 
విట‌మిన్ ఏ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ విట‌మిన్ శ‌రీరంలో మోతాదుకు మించినా దాని ప్ర‌భావం లివ‌ర్‌పై ప‌డుతుంద‌ట‌. దీంతో లివ‌ర్ ఆరోగ్యం నాశ‌న‌మ‌వుతుంద‌ట‌. ప్రస్తుతం మార్కెట్‌లో కుప్పలుతెప్పలుగా లభిస్తున్న చిప్స్‌ వంటి ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువగా తీసుకున్నట్టయితే వాటిలో ఉండే రసాయనాలు, విష‌పూరిత‌మైన ప‌దార్థాలు లివ‌ర్ ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపి దాని పనితీరు మందగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

తర్వాతి కథనం
Show comments