Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంలో హానికారక పదార్థం హైడ్రాన్.. విషం కంటే ప్రమాదమట!

బెల్లాన్ని అధికంగా ఉపయోగించే వారికి నిజంగా ఇది చేదువార్తే. బెల్లం తయారీలో హానికార‌క ర‌సాయ‌నాలు వాడుతున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఇది విషం కంటే అత్యంత ప్రమాదరకమని వారు వెల్లడిస్త

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (10:32 IST)
బెల్లాన్ని అధికంగా ఉపయోగించే వారికి నిజంగా ఇది చేదువార్తే. బెల్లం తయారీలో హానికార‌క ర‌సాయ‌నాలు వాడుతున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఇది విషం కంటే అత్యంత ప్రమాదరకమని వారు వెల్లడిస్తున్నారు. 
 
బెల్లం తయారీలో హైడ్రాన్ ‌(స‌ల్ఫ‌ర్‌), సోడియం కార్బొనేట్‌, సూప‌ర్ ఫాస్ఫేట్‌ వంటి రసాయన పదార్థాలను రైతులు విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తున్న‌ట్టు అన‌కాప‌ల్లి ప్రాంతీయ వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌నా సంస్థ శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. నిజానికి బెల్లం రంగు అనేది అక్క‌డి నేల స్వ‌భావం, సేంద్రియ‌, ర‌సాయ‌న ఎరువుల వాడ‌కాన్ని బ‌ట్టి ఉంటుంది. 
 
అయితే బెల్లం రంగు బాగా ఆక‌ర్షణీయంగా ఉండాల‌నే ఉద్దేశంతో రైతులు య‌ధేచ్ఛ‌గా ర‌సాయ‌నాల‌ను వాడేస్తున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రైతులే అంగీక‌రించ‌డం గ‌మ‌నార్హం. హైడ్రాన్ క‌లిసిన బెల్లం తిన‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో నాడీ వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. ఆస్త‌మా, జీర్ణ  సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వారు హెచ్చరిస్తున్నారు. 
 
వాస్తవానికి బెల్లంలో 70 పీపీఎం కంటే ఎక్కువ గంధ‌కం (సల్ఫర్) ఉండ‌కూడ‌దు. అయితే ఇది ప్ర‌స్తుతం ల‌భిస్తున్న బెల్లంలో 150 పీపీఎం నుంచి 500 పీపీఎం.. అంటే ఉండాల్సిన స్థాయి కంటే ఐదారు రెట్లు ఎక్కువ ఉన్న‌ట్టు తేలింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments