Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కురుపులు... నివారణ చిట్కాలు!

Webdunia
బుధవారం, 23 మార్చి 2016 (08:59 IST)
కనురెప్పల మీద వచ్చే చిన్న చిన్న కురుపులు రెప్పమీద ఉండి ఇబ్బందిపెడతాయి. బ్యాక్టీరియా చేరడంవల్ల గాని, కనురెప్పలమీదున్న తైలగ్రంధి నాళం మూత పడటం వల్ల గాని అలా కురుపు వచ్చినపుడు దానిమీద వేడి కాపడం పెట్టాలి. వేడి చేసిన గుడ్డను ఆ కురుపు మీద రోజులో నాలుగైదుసార్లు పెట్టాలి. ఒక చెంచా ధనియాలను ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
 
మరికొన్ని చిట్కాలు... 
1. టీ బ్యాగ్‌ని వేడినీటిలో ముంచితీసి దానిని కంటి కురుపుమీద 8-10 నిమిషాలు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా తగ్గేవరకూ చేయాలి. 
2. బంగాళాదుంప గుజ్జు చేసి గుడ్డమీద పరిచి ఆ ముద్దలోపల వున్న గుజ్జుతో కురుపు మీద తుడవాలి. 
3. ఆముదం చేతివేలు మీద తీసుకుని ఆ కురుపు మీద పలుమార్లు రుద్దితే కురుపు తగ్గుతుంది. జామ ఆకును వేడిచేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి. 
4. ఒక చెంచా ఉప్పును ఒక కప్పు నీటిలో వేసి ఆ నీరు అరకప్పు అయ్యేవరకు మరిగించి, చల్లార్చి, వడకట్టిన నీటిని కంటిలో రోజుకు మూడుసార్లు చుక్కలుగా వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
5. లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టుకోవాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

రహదారి భద్రతపై బైక్ ర్యాలీతో అవగాహన కల్పిస్తున్న జియో

జగన్ సీఎం అయిన మరుక్షణం నుంచే టీడీపీ కార్యకర్తలకు వీపు విమానం మోతమోగుతుంది : పెద్దిరెడ్డి

అమెరికాలో రోడ్డు ప్రమాదం... కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నేత మృతి

త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశా... పాపాలన్నీ పోయాయి : పూనమ్ పాండే

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

రాజమౌళి సినిమాలకు పనిచేసేలా ఎదిగిన కుశేందర్ రమేష్ రెడ్డి

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

Show comments