Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లద్దాలు ఎందుకు.. కంటి నిండా నిద్రపోండి..

గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోవడం ద్వారా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తప్పట్లేదు. ఇలాంటి కంటి దృష్టి లోపాల నుంచి గట్టెక్కేందుకు చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే కళ్లద

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (11:41 IST)
గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోవడం ద్వారా కంటి ఆరోగ్యం మందగిస్తుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తప్పట్లేదు. ఇలాంటి కంటి దృష్టి లోపాల నుంచి గట్టెక్కేందుకు చాలామంది కళ్లద్దాలు వాడుతున్నారు. అయితే కళ్లద్దాలు వాడటం కంటే పోషకాహారం తీసుకుంటే కంటి దృష్టి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా రోజూ ఓ కప్పు మునగాకు, ఓ కోడిగుడ్డును ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆకుకూరలు, కాయగూరలతో చేసే సలాడ్లలో విటమిన్‌ ఎతోపాటూ కెరొటినాయిడ్స్‌, జియాంతిన్‌, లెట్యూన్‌ వంటి పోషకాలు ప్రత్యేకంగా అందుతాయి. ఈ పోషకాలు కంటికి హానిచేసే తీవ్రమైన కాంతి నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. కాయగూరలతో చేసిన సలాడ్లవల్ల చిన్నవయసులో కళ్లద్దాల అవసరం వుండదు. 
 
అలాగే కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవాలంటే.. కంటినిండా నిద్ర తప్పనిసరి.  ఇన్‌సోమ్నియా వంటి నిద్రలేమి సమస్యలున్నవారు రోజూ సలాడ్‌ తినడం వల్ల హాయిగా, కంటినిండా నిద్రపోవచ్చు. సలాడ్లలో ఎక్కువగా ఉపయోగించే లెట్యూస్‌ ఆకులో మంచి నిద్రకు అవసరం అయిన లెక్ట్యూకారియమ్‌ అనే రసాయనం ఉంటుంది.
 
అలాగే కంటిచూపు సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ఎక్కువ కాయగూరలు తీసుకోవాలి. పచ్చికాయగూరల వల్ల శరీరంలో ఎంజైములు ఎక్కువగా వచ్చి చేరతాయి. ఈ ఎంజైములు శరీరం పోషకాలని ఎక్కువగా స్వీకరించేందుకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments