Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదుటివారిని ఇబ్బంది పెట్టే నోటి దుర్వాసన.. నివారణ చిట్కాలు

చాలామందిని వేధించే సమస్యలో మొదటిది నోటిదుర్వాసన. ఈ సమస్య గురించి ఎదుటి వ్యక్తులు మనతో చెప్పక పోయినా వెనుక మాట్లాడుతుంటారు. నోటి దుర్వాసన మనతో పాటు మన తోటివారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ ఇబ్బంది ను

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (13:39 IST)
చాలామందిని వేధించే సమస్యలో మొదటిది నోటిదుర్వాసన. ఈ సమస్య గురించి ఎదుటి వ్యక్తులు మనతో చెప్పక పోయినా వెనుక మాట్లాడుతుంటారు. నోటి దుర్వాసన మనతో పాటు మన తోటివారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరి...
 
ప్రతి రోజు యాపిల్ తింటే వైద్యుడి దగ్గర వెళ్లాల్సిన అవసరం లేదని పెద్దలు అంటుంటారు. అలాంటి యాపిల్ నోటి దుర్వాసన రాకుండా కూడా కాపాడుతుందని నిపుణులు చెపుతున్నారు. 
 
తులసి, పుదీనా ఆకులు నోటి దుర్వాసన నుంచి విముక్తి కలిగిస్తుంది. వీటిలో ఉండే నూనె పదార్థం ముక్కు నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేస్తాయి.
 
అల్లం జీర్ణక్రియకు మాత్రమే కాకుండా.. నోటి దుర్వాసన రాకుండా కూడా కాపాడుతుంది. భోజనం అనంతరం ఒక అల్లం ముక్క నోటిలో వేసుకుంటే నోటిని శుభ్రం చేసి దుర్వాసన రాకుండా చేస్తుంది.
 
దాల్చిన చెక్క రోజూ తీసుకుంటే నోటి దుర్వాసన రాకుండా కాపాడుతుంది.
 
గ్రీన్ టీ లో నిర్గందీకరణ లక్షణాలు ఎక్కువగా ఉంది నోటి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. ఇది కేవలం నోటి దుర్వాసనే కాదు నోటి క్యాన్సర్‌ను కూడా దూరం చేస్తుంది.
 
నోటి దుర్వాసన రాకుండా చేసే మంచి మందు సోపు గింజలు. సోపుగింజల నూనెలు యాంటి బాక్టీరియా లక్షణాలు కలిగి నోటి దుర్వాసన కలిగించే బాక్టీరియాను దూరం చేస్తుంది.
 
నోటిలో లాలాజలం ఊరుతుంటే బాక్టీరియా దానంతట నశిస్తుంది. నోరు ఎండిపోయినట్టు ఉంటే బాక్టీరియా దాడి చేస్తుంది. అందుకే మంచి నీరు నోటిలో బాక్టీరియాను దూరం చేస్తుంది.
 
బ్రోకోలి, స్ట్రాబెర్రీ, నారింజ పండ్లలో విటమిన్ సి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

తర్వాతి కథనం
Show comments