Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పండ్లు తినడం వల్ల.. 60 ఏళ్లు దాటినా అందంగా

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (15:27 IST)
మంచి ఆరోగ్య అలవాట్లు ఉంటే వయసు మీదపడినా అనారోగ్యం దరి చేరదు. ఆసుపత్రులకు పరిగెట్టే పని ఉండదని పెద్దలు చెబుతుంటారు. 30 ఏళ్లు దాటితేనే ఏదో ఒక అనారోగ్యం చుట్టుముడుతున్న ఈ రోజుల్లో అక్కడి తెగ వారికి మాత్రం 60 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా ఉంటారు.

70 ఏళ్లు మీదపడ్డా చర్మం ఏ మాత్రం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంటారు. వారే పాకిస్తాన్‌ హుంజా ప్రాంతంలో నివసిస్తున్న బురుషా తెగవారు. సాధారణంగా మహిళలకు 40 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఒకవేళ పుట్టినా ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటారు. కానీ ఈ తెగ వారు మాత్రం 60 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంటారు. మరి ఇలా ఉండడానికి వీరి జీవన విధానం ఎలా ఉంటుందో అని ఆరా తీస్తే.. వాస్తవానికి పాకిస్థానీయుల సగటు జీవిత కాలం 67 ఏళ్లు.

కానీ హుంజాల సగటు వయసు వందేళ్లు. వీరిలో 90 శాతం మంది అక్ష్యరాస్యులే ఉంటారు. గడ్డ కట్టే చలిలో కూడా చన్నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. ప్రతి రోజు వ్యాయామం చేస్తారు. ఎక్కువ దూరం ఉన్నా నడవడానికే ప్రాధాన్యత ఇస్తారు. స్వయంగా ఆహార పదార్థాలను పండించుకుంటారు.

తాజా పండ్లు, కూరగాయలు, పాలు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే హుంజాలు తింటారు. నిల్వ ఆహార పదార్థాలను అసలు ముట్టుకోరు. రోజుకు 2వేల కేలరీలకు మించి ఆహారం తీసుకోరు.
 
పండ్లలో ముఖ్యంగా ఆప్రికాట్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఈ పండులో ఉండే విటమిన్ బీ-17కు కేన్సర్ వ్యాధిని నిరోధించే లక్షణం ఉంది. అందుకే హుంజాలకు కేన్సర్ అంటే తెలియదు. ఒక్కోసారి రెండు మూడు నెలలపాటు ఆహారాన్ని మానేసి ఆప్రికాట్ పండ్ల నుంచి తీసిన రసాన్ని ఎక్కువగా తాగుతుంటారు. ఇది వారికి సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుంటారు.

ఇక్కడ మాత్రమే దొరికే ‘తుమురు’ టీ చాలా రుచిగా ఉంటుంది. మూలికలతో తయారు చేసే ఈ టీ వల్ల వీరి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అందుకే హుంజాలు 60ల్లో కూడా 20 ఏళ్ల వయసు వారిలా కనిపిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం
Show comments