Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నూనెతో బరువు తగ్గొచ్చు.. గుండె నొప్పులు పరార్..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (16:52 IST)
కొబ్బరి నూనె జుట్టుకు పోషణ అందిస్తుందని మనకు తెలుసు. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నూనె చాలా వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కేరళలో కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అందువల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో గుండె జబ్బులు చాలా తక్కువుగా ఉంటున్నాయని పరిశోధనలో తేలింది. 
 
కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. జీర్ణ వ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలు కొబ్బరి నూనె వలన మనకు అందుతాయి. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా, వైరస్ మరియు ఇతర హానికర శిలీంద్రాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. 
 
కొబ్బరి నూనె వాడకం వలన అనేక రకాల అంటువ్యాధులను తరిమి కొట్టవచ్చు. ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా మూత్రపిండాలలో ఉన్న రాళ్లను, పిత్తాశయంలో ఎదురయ్యే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కొబ్బరి నూనె సహాయపడుతుంది. 
 
ఇందులో ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మేలు చేస్తాయి. అలాగే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్, రక్తపోటు వల్ల గుండెకు హాని కలుగకుండా రక్షణనిస్తుంది. కొబ్బరినూనె దంతక్షయాన్ని నివారిస్తుంది. మెదడు కణాలకు శక్తినందించి అల్జీమర్స్ బారి నుండి కాపాడుతుంది. శరీర కండరాలను బలోపేతం చేస్తుంది. 
 
అలాగే క్యాన్సర్ కణితులను ప్రేరేపించే కణాలను నాశనం చేసే శక్తి కొబ్బరినూనెకు ఉంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి అందోళన వంటి సమస్యలను దూరం చేస్తుంది. దేహ కాంతిని పెంచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం
Show comments