Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకు పొడిని ఇలా తింటే బరువు తగ్గుతారు..

బరువు తగ్గాలనుకుంటున్నారా? డైట్ పాటిస్తున్నారా? అయితే ఇక డైట్ అక్కర్లేదు. మునగాకు పొడి మాత్రమే చాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారికి మునగాకు పొడి మంచిది. ఈ పొడిని వేడి వేడి అన్నంలో

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (13:00 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా? డైట్ పాటిస్తున్నారా? అయితే ఇక డైట్ అక్కర్లేదు. మునగాకు పొడి మాత్రమే చాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారికి మునగాకు పొడి మంచిది.

ఈ పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని ఆరు ముద్దలు వరకు తీసుకుంటే.. కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు. మునగాకు పొడి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. పోషకాహారం తగినంత అందని బాలింతలకు, గర్భిణులకు మునగాకు పొడి దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
మునగాకులో ఐరన్ అధికంగా వుంటుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఆహారంలో మునగాకు తీసుకుంటే రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. రేచీకటిని నివారించాలంటే.. మునగాకులో వారంలో రెండుసార్లు తీసుకోవాలి. ఇందులోని బీటాకెరోటిన్ కంటి దృష్టి లోపాలను తొలగిస్తుంది. ఎండిన మునగను మించిన సౌందర్య సాధనం లేదంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. 
 
తలలో చుండ్రు నివారణకు, జుట్టు ఒత్తుగా పెరగడానికి, చర్మాన్ని కాంతిమంతంగా చేయడానికి మునగ ఉపయోగపడుతుందని వారు సూచిస్తున్నారు. చర్మం అందంగా తయారవ్వాలంటే.. మునగాకు పొడిని పేస్టులా చేసుకుని ముఖానికి పట్టించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చర్మం మిలమిల మెరిసిపోతుంది. అలాగే చుండ్రుతో బాధపడేవారు.. మునగాకు పేస్టును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments