Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ శబ్దాలు వింటూ కాఫీ తాగుతున్నారా... వినికిడి లోపం ఖాయం...

సాధారణంగా ప్రతి రోజూ నిద్రలేవగానే ఓ మంచి కాఫీ తాగడం ప్రతి ఒక్కరికీ అలవాటు. అలాగే, బయటకు వెళ్లినపుడు కాస్తంత రిలీఫ్ కోసం రోడ్ల వెంబడి ఉండే టీ దుకాణాలు, హోటల్స్‌లలో కూడా టీకాఫీలు తాగుతుంటారు. కానీ, భారీ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:58 IST)
సాధారణంగా ప్రతి రోజూ నిద్రలేవగానే ఓ మంచి కాఫీ తాగడం ప్రతి ఒక్కరికీ అలవాటు. అలాగే, బయటకు వెళ్లినపుడు కాస్తంత రిలీఫ్ కోసం రోడ్ల వెంబడి ఉండే టీ దుకాణాలు, హోటల్స్‌లలో కూడా టీకాఫీలు తాగుతుంటారు. కానీ, భారీ శబ్దాలు వినబడే ప్రాంతాల్లో కాఫీ తాగడం వల్ల పెను ముప్పు పొంచివునట్టు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. 
 
భారీ శ‌బ్దాలు వ‌చ్చే నిర్మాణ రంగం, పబ్బులు, పేలుళ్లు ఎక్కువ‌గా వినిపించే ప్ర‌దేశాల్లో పనిచేసేవారికి కాఫీ అల‌వాటు ఉంటే వారి చెవులకి ప్ర‌మాదం అధికంగా ఉంటుంద‌ని తేల్చిచెబుతున్నారు. ఆయా ప్ర‌దేశాల్లో ప‌ని చేసేవారికి రెండు మూడు రోజుల వరకూ ఆ శబ్దాలు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉండ‌టం సాధార‌ణ‌మేన‌ని ఇటువంటి స్థితిలో వారు కాఫీ తాగితే వినికిడి శక్తి తగ్గుతుంద‌న్నారు. 
 
భారీ శబ్దాల వ‌ద్ద ప‌నులు చేసే వారిని రెండు గ్రూపులుగా విభజించి తాము చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ అంశం రుజువ‌యిన‌ట్లు వారు చెబుతున్నారు. త‌మ ప‌రిశోధ‌న‌లో భాగంగా ఒక‌ గ్రూపు వారికి పని స్థలంలోనే కాఫీ ఇచ్చి, మ‌రో గ్రూపు వారికి వారి ప‌ని అయిపోయిన కొన్ని గంటల త‌రువాత‌ కాఫీ ఇచ్చారు. అనంతరం ఇరు గ్రూపుల వ్య‌క్తుల వినికిడి శక్తిని పరిశీలించి చూశారు. 
 
వీరిలో భారీ శబ్దాలు వింటూ కాఫీ తాగిన వారికి చెవుల వినికిడి శక్తి త‌గ్గిన‌ట్లు పరిశోధకులు గుర్తించారు. ప‌ని స‌మ‌యంలో కాఫీ తాగని వ్య‌క్తుల్లో ఇటువంటి లోపం క‌నిపించ‌లేద‌ని వారు పేర్కొన్నారు. అందువల్ల భారీ శబ్దాలను ప్రతిరోజూ చాలా దగ్గరగా వినేవారు ఆ సమయంలో కాఫీ తాగే అల‌వాటుకు గుడ్ బై చెబితే మంచిద‌ని వారు సూచించారు. ఈ పరిశోధనను కెనడాలోని మెక్‌గ్రిల్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేశారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments