Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు తాగితే స్లిమ్‌గా అవుతారా...!

శరీర బరువును త‌గ్గించుకోవ‌డానికి లావుగా ఉన్నవాళ్లు తొంద‌ర‌పడుతుంటారు. అందుకోసం నిత్యం వ్యాయామాలు చేస్తూ కుస్తీప‌డుతూ, డైట్‌ పాటిస్తుంటారు. కానీ వీటితోపాటు వీళ్లు నీళ్లు కూడా తాగితే మంచిది. మంచినీళ్లు బాగా తాగితే స్లిమ్‌గా తయారవుతారట. శరీరం బరువు తగ్గ

Webdunia
బుధవారం, 4 మే 2016 (16:18 IST)
శరీర బరువును త‌గ్గించుకోవ‌డానికి లావుగా ఉన్నవాళ్లు తొంద‌ర‌పడుతుంటారు. అందుకోసం నిత్యం వ్యాయామాలు చేస్తూ కుస్తీప‌డుతూ, డైట్‌ పాటిస్తుంటారు. కానీ వీటితోపాటు వీళ్లు నీళ్లు కూడా తాగితే మంచిది. మంచినీళ్లు బాగా తాగితే స్లిమ్‌గా తయారవుతారట. శరీరం బరువు తగ్గుతుందిట. 
 
రోజులో మనం ఎన్ని నీళ్లు తాగుతున్నామన్న దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మన శరీరం బాగా పనిచేస్తుంది. జీవక్రియ బాగా జరుగుతుంది. అలాకాకుండా తక్కువ నీళ్లు తాగితే శరీరంలో రసాయన క్రియలు కూడా సరిగా జరగవు. ఇదంతా ఒక ఎత్తయితే, ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. బాగా ఆకలి వేసినపుడు కేలరీలు బాగా ఉన్న ఫుడ్‌ని ఎక్కువగా తినేస్తుంటాం. 
 
ఇలాంటి సమయాల్లో ముందుగా ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగామనుకోండి ఎక్కువ ఆహారం కడుపులోకి పోదు. అందుకే ఏదైనా తినే ముందు నీళ్లు బాగా తాగితే తిండి ఎక్కువ తినం. అందుకే నీళ్లు తాగడం ద్వారా తినే ఆహారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో శరీరంలోకి ఎక్స్‌ట్రా కాలరీలు వెళ్లవు. నీళ్లు ఎక్కువ తాగుతూ.... రోజులో నాలుగుసార్లు కొద్దికొద్దిగా ఫుడ్‌ తినడం వల్ల శరీర బరువు పెరగకుండా అదుపులో ఉంటుంది.
 
ఇంతకూ చెప్పేదేమిటంటే బరువు తగ్గడానికి డైట్‌ పాటిస్తున్న వాళ్లు ఫ్లూయిడ్స్‌ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నీళ్లను బాగా తాగాలి. షుగర్‌, యాడిటివ్స్‌ లేని పండ్ల రసాలను తీసుకోవాలి. పండ్ల రసాల్లో పోషక విలువలు ఉన్నట్టే కూరగాయల రసాల్లో కూడా ఉంటాయి. కాబట్టి కూరగాయల రసాన్ని కూడా నిత్యం తీసుకోవాలి. వీటిల్లో కాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మీగడ లేని పాలు లేదా తక్కువ ఫ్యాట్‌ ఉన్న పాలను తీసుకోవాలి. వీటిల్లో కాలరీలు తక్కువ ఉండి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 
 
బ్లాక్‌ కాఫీ, గ్రీన్‌ టీ రెండూ కూడా మంచివే. వీటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలరీలు ఉండవు. కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌కు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటిల్లో కాలరీలు అధికంగా ఉంటాయి, పోషకవిలువలు మాత్రం ఉండవు. అలాగే ఎనర్జీ డ్రింకులకు కూడా దూరంగా ఉండాలి. వీటిల్లో కూడా కాలరీలు అధికంగా ఉంటాయి. ఆల్కహాల్‌ కూడా శరీరానికి మంచిది కాదు. ఇందులో కూడా కాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీర బరువును అదుపులో పెట్టడానికి రోజూ నీళ్లు బాగా తాగాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments