Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కుతో ఆటలొద్దు .. కరోనాను శరీరంలోకి ఆహ్వానించవద్దు

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (15:19 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వ్యాప్తి పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో కొంతమంది  నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. ఇప్పటికీ ప్రజల్లో వైరస్ వ్యాప్తిపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణమన్న భావన కలుగుతోంది. ముఖ్యంగా జనసంవర్థమైన ప్రాంతాల్లోకి వచ్చేటప్పుడు ముఖానికి మాస్కు ధరించడం లేదు. 
 
మరికొంత మంది మాస్కులు ధరించినా.. వాటిని వినియోగించడంపై సరైన అవగాహన లేకపోవడం, మాస్కును నిమిషానికి ఒకసారి తడుముకోవడం, కిందకు లాగడం, పైకి పెట్టడం, ముక్కు కిందకు లాగడం, మెడపైన, తలపైన ఉంచడం చేస్తున్నారు. మరికొందరు వాటిని జనం సమూహాల్లోనే ఎక్కడపడితే అక్కడ తీసేస్తూ.. ముఖాన్ని చేతులతో తుడుచుకుని మాస్కును తిరిగి పెట్టుకుంటున్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. 
 
మరోవైపు కొంతమంది మాత్రం తాము చాలా జాగ్రత్తగా ఉంటున్నామని.. అయినా వైరస్ బారిన ఎలా పడ్డామో తెలియడం లేదని చెబుతున్నారు. కానీ వారికి తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో మాస్కులు ధరిస్తూనే ప్రజలు చేస్తున్న పొరపాట్లను ఇక్కడ వివరించడం జరుగుతోంది. మాస్కులను ధరించే ప్రతిఒక్కరూ వీటిని గమనించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
 
మాస్కు ధరించినపుడు ఎక్కువమంది చేస్తున్న పొరపాట్లు:
 
1) ఆఫీసులో రోజూ సహచర సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. అందరం కలిసే ఉంటున్నాం కదా.. ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో మాస్కు అవసరం లేదనుకుంటాం. అది తప్పు. ఆఫీసులో ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కు  ధరించాలి. 
 
2) మనం మన ప్రాణ స్నేహితులతో చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటాం. వాళ్లు నా ఆప్త మిత్రులేకదా. వారితో మాట్లాడేటపుడు మాస్కు అవసరం లేదనుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడినా మాస్కు ధరించడం శ్రేయస్కరం. 
 
3) కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాస్కు అవసరం లేదనుకుంటూ ఉంటారు. అది కూడా తప్పు. ఇంట్లోనూ ఎవరైనా పెద్దవారుంటే వారితో మాట్లాడినా మాస్కు ధరించడం మంచిది. 
 
4) మరికొంత మందికి మాస్కు నోరు, ముక్కును పూర్తిగా కప్పి ఉంచాలన్న విషయం కూడా తెలియడం లేదు. చాలామంది మాస్కులను చేతితో పట్టుకుని, చెవికి వేలాడదీస్తూ ఇతరులతో కబుర్లు చెప్తూ ఉంటారు. అలా చేయకూడదు. జనంలోకి వెళ్లినపుడు వైరస్ బాధితులు ఎవరైనా తుమ్మినా, దగ్గినా వారి నోటి నుంచి వెలువడే తుంపర్లు మన ముఖంపై పడకుండా చూసే రక్షణ కవచమే మాస్కు.  
 
5) మాస్కును ధరించిన తర్వాత తరచూ చేతితో మాస్కును ముట్టుకోవడం, కళ్లు, ముక్కు, నోటి దగ్గర చేతిని పెట్టుకుని రుద్దడం అస్సలు చేయకూడదు. కరోనా వైరస్ అనేది 99 శాతం మన చేతుల ద్వారానే ముక్కు, నోరు, కంటిలోనికి ప్రవేశించి శరీరంలోకి వెళ్తుంది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు ప్రతి నిమిషానికొకసారి మాస్కును చేతులతో రుద్దడం, ముఖాన్ని తాకడం చేస్తున్నారు. 
 
6) చేతులు కలపడం, కరచాలనం చేయడం అస్సలు చేయవద్దని చెబుతున్నప్పటికీ ప్రజలు పెద్దగా ఈ నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికీ చాలా మంది యువత జనసమూహాల్లోనూ చేతులు కలుపుతూ, ఒకరికొకరు ముఖం దగ్గరగా పెట్టుకుని మాట్లాడుకోవడం చేస్తూనే ఉన్నారు. 
 
7) సెల్ ఫోనులో మాట్లాడేతప్పుడు చాలా మంది మాస్కులు తొలగించి మాట్లాడుతున్నారు. ఒక్కరే ఉన్నపుడు అలా చేయడం తప్పులేదు. కానీ జనసంవర్థమైన ప్రాంతాల్లో కూడా ముఖానికి మాస్కు తొలగించి ఫోనులో మాట్లాడుతూ.. చేతితో ముఖాన్ని తాకుతున్నారు. అలా చేస్తున్నారంటే మన శరీరంలోకి కరోనాను రమ్మని మనమే ఆహ్వనించినట్టే.
 
8) చాలా మంది మాస్కు ధరించిన తర్వాత మధ్యలో తొలగించి చెమట తొలగించుకోవడంలాంటివి చేస్తున్నారు. చొక్కాతో, మెడలో ఉండే కండువాతో తుడుచుకుంటున్నారు. కరోనా బాధితులెవరైనా తుమ్మినపుడు తుంపర్ల రూపంలో వైరస్ వచ్చి మన చొక్కాలపై పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. చాలా మంది మాస్కును తొలగించి ఆ చొక్కాతో ముఖం తుడుచుకోవడం ద్వారా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. 
 
9) మరికొంతమంది మాత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మాస్కు ధరించే వస్తున్నారు. అయితే తెలిసిన వారెవరైనా కనిపించగానే మాస్కును తలపైకి పెట్టుకుని కులాసాగా మాట్లాడుకుంటున్నారు. ఇదే తమను వైరస్ బారినపడేలా చేస్తుందనే విషయం తెలియక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. 
 
10) కాబట్టి మాస్కును ధరించడమే కాదు. మాస్కు ధరించినపుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటారు. ప్రతి ఒక్కరూ మాస్కును ధరించినపుడు పైన చెప్పిన అంశాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని మనం అడ్డుకోగలుగుతాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments