Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే బరువు తగ్గుతారు..!

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (07:13 IST)
బరువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లి కసరత్తులే చేయాల్సిన అవసరం లేదు. ఏం చక్కా ఇంట్లోనే ఈ ఆరు వెయిట్ లాస్ టిప్స్ పాటిస్తే చాలు. హాయిగా బరువు తగ్గొచ్చు. అయితే.. ఈ టిప్స్ ను ఏదో ఒకసారి రెండు సార్లు చేయడం కాదు.. కంటిన్యూగా చేస్తూ ఉంటేనే బరువు తగ్గుతారు అనే విషయం గుర్తు పెట్టుకోండి.
 
నేటి యువతను ఎక్కువగా బాధించే విషయాల్లో ఒకటి బరువు. అవును…ఉన్నపళంగా బరువు పెరుగుతూ పోతుంటే ఎవరికి బాధ ఉండదు చెప్పండి. అసలే బిజీ లైఫ్. వండుకోవడానికి కూడా టైమ్ ఉండదు. బయటి ఫుడ్డును ఇష్టమున్నట్టు తినేస్తాం. ఇంకేమన్నా ఉందా? బరువు పెరగమంటే పెరగమా? దానికి తోడు స్మార్ట్ ఫోన్లు, నిద్రలేమీ, వ్యాయామం చేయకపోవడం… వీటన్నింటి ఫలితమే బరువు పెరగడం.
 
బరువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లి కసరత్తులే చేయాల్సిన అవసరం లేదు. ఏం చక్కా ఇంట్లోనే 'ఈ ఆరు వెయిట్ లాస్ టిప్స్' పాటిస్తే చాలు. హాయిగా బరువు తగ్గొచ్చు. అయితే.. ఈ టిప్స్ ను ఏదో ఒకసారి రెండు సార్లు చేయడం కాదు.. కంటిన్యూగా చేస్తూ ఉంటేనే బరువు తగ్గుతారు అనే విషయం గుర్తు పెట్టుకోండి.
 
1.లిఫ్టా? వద్దు బాబోయ్.. మెట్లే నాకు ముద్దు
లిఫ్ట్ వద్దు… మెట్లే ముద్దు అనాలి మీరు. అవును.. మీ ఫ్లాట్.. రెండో ఫ్లోరో లేక అంతకన్నా ఎక్కువ ఫ్లోర్ లో ఉందనుకోండి. ఏం చేస్తారు. ఏదైనా పనికి బయటికి వెళ్లినా.. తిరిగి ఇంటికి వచ్చినా.. లిఫ్ట్ లోనే వెళ్తున్నారా? ఇకనుంచి ఆపేయండి.

ఇంటి దగ్గరే కాదు.. షాపింగ్ మాల్స్ లో, ఆఫీసుల్లో ఎక్కడైనా సరే మెట్లు ఉపయోగించండి. ఏదో ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. అలా ఓ నెల మెట్ల మీద నడిచి చూడండి. ఓ ఐదు నిమిషాలు మెట్లు ఎక్కితే 144 కేలరీలు ఖర్చు అవుతాయట. ఓ నెల మెట్ల మీద నడిచాక.. మీకు మీరే ఫలితం చూసుకొని ఆశ్చర్యపోవడం ఖాయం.
 
2.గంటలు గంటలు కూర్చీలకు అతుక్కుపోకండి
కొంతమందయితే కుర్చీల్లో కూర్చున్నారంటే అంతే ఇక.. గంటలు గడిచినా లేవరు. ఎందుకంటే అది లేవనీయదు కదా. ఇక ఆఫీసుల్లో కూర్చొని పనిచేసేవాళ్ల సంగతయితే చెప్పక్కర్లేదు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి ఎక్కితే మధ్యాహ్నం లంచ్ టైమ్ వరకు కూడా కుర్చీలో నుంచి లేవరు. లంచ్ తర్వాత మళ్లీ కూర్చుంటే సాయంత్రం 5 దాకా లేవరు.

దీనివల్ల బరువు పెరగడమే కాదు.. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట. అందుకే.. కుర్చీలో కూర్చున్నాక కనీసం గంటకోసారైనా లేవాలట. గంటలో కనీసం 15 నిమిషాలైనా లేచి నిలబడాలట. ఇంకా కుదిరితే ఓ నాలుగు అడుగులు అటూ ఇటూ నడిస్తే ఇంకా మంచిదట. అలా చేస్తే 35 కేలరీలు ఖర్చవుతాయట.
 
3.ఇంటిని శుభ్రం చేయండి
కొంతమందికి అయితే టైమ్ పాస్ కావట్లేదు అంటూ తెగ ఆందోళన చెందుతుంటారు. అటువంటి వాళ్లు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలు. అటు ఇల్లు క్లీన్ అవుతుంది. టైమ్ కూడా గడిచిపోతుంది. దాంతో పాటు మీ ఒంట్లోని కేలరీలు కూడా ఖర్చు అవుతాయి.
 
4.చూయింగ్ గమ్స్
చూయింగ్ గమ్స్ ఎప్పుడైనా నమిలారా మీరు. అవి కూడా మంచిదేనట. కాకపోతే షుగర్ లెస్ చూయింగ్ గమ్స్ అయిటే బెటర్ అని అంటున్నారు నిపుణులు. చూయింగ్ గమ్స్ నమలడం వల్ల కూడా బరువు తగ్గుతారట. ఓ గంట సేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల దవడ కండరాలు కదిలి… 11 కేలరీలు ఖర్చు అవుతాయట.
 
5.మీ వాహనాలను మీరే శుభ్రం చేసుకోండి
మీకు కారు, బైక్, సైకిల్.. ఇలా ఏ వాహనం ఉన్నా… వాటిని మీరే శుభ్రం చేసుకోండి. ఉదయం లేవగానే ఓ అర్ధగంట వాటిని శుభ్రం చేసేందుకు కేటాయిస్తే… మీ ఒంట్లోని అనవసర కొవ్వు కరుగుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. ఏదైనా ఓ వాహనాన్ని గంట సేపు శుభ్రం చేస్తే 280 కేలరీలు ఖర్చవుతాయట.
 
6.పిల్లలతో కాసేపు ఆడుకోండి
మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? వాళ్ల అల్లరి తట్టుకోలేకపోతున్నారా? అయితే.. పిల్లలతో కాసేపు సరదాగా ఆడుకోండి. వాళ్లతో సరదాగా కాసేపు గడపండి. అప్పుడు మీరు రిలాక్స్ అవడంతో పాటు.. మీ కేలరీలు కూడా తగ్గుతాయి. కాకపోతే.. మీరు పిల్లలతో ఇంట్లో గడపడం కాదు.. బయటికి వెళ్లాలి. అలా సరదాగా పిల్లలను పార్క్ కు తీసుకెళ్లి.. వాళ్లతో పాటు ఆడుకోండి. అప్పుడు వద్దన్నా.. మీ ఒంట్లోని కొవ్వు కరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

తర్వాతి కథనం
Show comments