Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిళ్లు తొందరగా నిద్ర పట్టడం లేదా?

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (07:33 IST)
చాలామంది రాత్రిళ్లు మేల్కునే ఉన్నారు. దీంతో అన్​లాక్‌ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి(no sleep). లాక్​డౌన్​ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు.  

చాలా మందిలో నరాల బలహీనత సమస్య ఎక్కువ అయింది. దీనివలన అప్పుడప్పుడు. తలనొప్పి రావడం, కాళ్లు చేతులు గుంజడం, ఆకలి వేయకపోవడం, ఆసక్తి లేకపోవడం, బయటకు చెప్పుకోలేని కొన్ని రకాల రోగాలు రావడం, మానసికంగా బలహీనంగా ఉండటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, నిద్రలేమి. వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. 

చాలామంది రాత్రిళ్లు మేల్కునే ఉన్నారు. దీంతో అన్​లాక్‌ అనంతరం మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకున్నా.. సాధ్యం కావడం లేదని పలువురు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం. నిద్రలేమి(Insomnia). లాక్​డౌన్​ కాలంలో పనేమీ లేకపోవడంతో ఇంట్లోనే ఇష్టం వచ్చిన సమయంలో నిద్రించేవారు.

కానీ మళ్లీ రొటీన్​ జీవితంలోకి అడుగుపెట్టాక అది ఇబ్బందిగా మారుతోంది. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం. రాత్రిళ్లు నిద్ర లేకపోవడం(sleeping problems), ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. నిద్రలేమికి ఆయుర్వేదం(Ayurveda)లో కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం..
 
1.-రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె(oil), లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.
 
 2.-రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు(milk) తాగాలి.
 
3.- నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి.
 
4.-ఇంకా, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ కోసం దూరంగా పెట్టడం మంచిది.
 
5.-పడుకునే ముందు నాటు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
 
6.- గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
 
7.- చేతివేళ్లతో లేదా దువ్వెనతో తల వెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.
 
8.-రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా
 
9.- ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి.
 
10.-ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments