Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్... మదుమేహం వ్యాధి ఎలా వస్తుంది..? లక్షణాలేంటి? వస్తే ఎలాంటి ఆహారం?

మన శరీరానికి చక్కెర (గ్లూకోజ్‌) ఎంతో అవసరం. యంత్రం పనిచేయాలంటే శక్తి అవసరం. అలాగే శరీరానికి కూడా. అందుకు కావలసిన శక్తిని ఇచ్చేది చక్కెర మాత్రమే. అందువల్ల మానవ దేహంలో గ్లూకోజ్‌ ఎలా తయారవుతుంది, ఎలా నిల్వ ఉంటుంది, ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను తెలుసుక

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (14:17 IST)
మన శరీరానికి చక్కెర (గ్లూకోజ్‌) ఎంతో అవసరం. యంత్రం పనిచేయాలంటే శక్తి అవసరం. అలాగే శరీరానికి కూడా. అందుకు కావలసిన శక్తిని ఇచ్చేది చక్కెర మాత్రమే. అందువల్ల మానవ దేహంలో గ్లూకోజ్‌ ఎలా తయారవుతుంది, ఎలా నిల్వ ఉంటుంది, ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను తెలుసుకోవడం అందరికీ అవసరం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి దారి తప్పినా అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యాన్నే మధుమేహ వ్యాధి (డయాబెటిస్‌) అంటారు.
 
దీనికే మరోపేరు చక్కెర వ్యాధి. శరీరంలో చక్కెర హెచ్చుతగ్గుల వల్ల కలిగే అనారోగ్యాన్ని వ్యాధి అని అంటున్నా, నిజానికి ఇది వ్యాధి కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలిగితే మనిషి ఎంతకాలమైనా హాయిగా జీవించగలడు.
 
మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అయిన చక్కెర కాలేయం (లివర్‌)లో నిల్వ ఉంటుంది. మనం శారీరకంగా ఎక్కువ కష్టపడితే, కణాలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే ఎక్కువ చక్కెర (గ్లూకోజ్‌) కావాలన్నమాట. దీనిని లివర్‌ అందిస్తుంది. ఇదికాక ఇంకా అదనపు చక్కెర నిల్వ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇదే డయాబెటిస్‌! దీనివల్ల మూత్రపిండాల (కిడ్నీస్‌) పైన అధిక భారం పడుతుంది.
 
మన దేహంలోని పాంక్రియాస్‌ అనే అవయవం ఇన్‌సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాంక్రియాస్‌ జీర్ణకోశానికి పక్కనే ఉంటుంది. చక్కెరను జీర్ణం చేయడంలో పాంక్రియస్‌దే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ పాంక్రియస్‌ బాధ్యత. 
 
వ్యాధి లక్షణాలు : 
* త్వరగా అలసిపోవడం, నీరసం 
* శరీరం నిస్సత్తువగా మారడం 
* పనిలో ఆసక్తి లేకపోవడం 
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం 
* తడవ తడవకూ మూత విసర్జన చేయడం 
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్న శరీరం బరువు తగ్గిపోవడం 
* కంటి చూపు మందగించడం 
* కీళ్ళనొప్పులు 
* ఒంటినొప్పులు 
* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం 
* కడుపులో నొప్పి 
* చర్మం మంటగా ఉండటం. గాయాలు త్వరగా మానకపోవడం 
* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం 
* సెక్స్ కోరికలు సన్నగిల్లడం 
* చర్మం ముడత పడటం. 
* రక్తహీనత 
* ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.
 
మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆహారం పరిమితంగా, నియంత్రణతో తీసుకోవాలి.
 
1. కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి.
2. మాంసాహారం, వెన్న, జున్ను తినడం తగ్గించాలి.
3. మత్తుపానీయాలు మానేయాలి.
4. తీపి పదార్థాలు అరుదుగా మాత్రమే తినాలి. వాటిలో చక్కెరలు, కొవ్వులు ఉంటాయి. 
5. తీపి పదార్థాలను విడిగా తినవద్దు. మిగిలిన ఆహారంలో భాగంగా తింటే మంచిది.
6. కొవ్వులు తక్కువుగా ఉన్న పాలనే తాగండి. మజ్జిగ తాగటం మంచిది. 
7. పలుచని పెరుగు తీసుకోవాలి.
8. తాజా కాయగూరలు తినాలి. ఉప్పు, కారం కూరలలో తక్కువ మోతాదులో వాడాలి.
9. ముదురు ఆకుపచ్చ రంగులో వుండే కూరగాయలు ఎక్కువుగా తీసుకోవాలి.
10. పండ్లరసం కాక పండ్లు, తొనలు తినాలి.
11. ఒకవేళ పండ్లరసం తీసుకుంటే అందులో చక్కెర మాత్రం వేసుకోవద్దు.
12. నిమ్మ, నారింజ, బత్తాయి వంటివి తినవచ్చు.
13. వంటకాలలో కొవ్వుల వాడకం పరిమితంగా ఉండాలి.

మధుమేహం ఎన్నిరకాలో తెలుసా...? ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి


మధుమేహానికి విరుగుడు... మయూరాసనం, ఎలా చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

తర్వాతి కథనం