Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహానికి దివ్యౌషధం.. ఆవాల పొడి.. తేనెతో కలుపుకుని తింటే?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (10:44 IST)
మధుమేహ వ్యాధి ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనికి కారణం శరీరంలో ఇన్సులిన్ వైఫల్యం. పాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ వైఫల్యంతో షుగర్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. ఆవాలు ఈ వ్యాధికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. రోజువారీ ఆహారంలో ఆవాలు చేర్చుకుంటే తప్పక ఫలితం ఉంటుంది. 
 
కప్పు ఆవాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. అలానే ఈ పొడిలో కొద్దిగా నూనె కలిపి ఇడ్లీ, దోస వంటి వాటిల్లో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవాలను బాగా ఎండబెట్టుకుని నూనెలో వేయించుకుని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకుని తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపు చేయవచ్చు. 
 
ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుటకు చాలా ఉపయోగపడుతాయి. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయి. తద్వారా వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఏ రూపంలో తీసుకున్నా మధుమేహ వ్యాధికి ఆవాలు దివ్యౌషధం.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments