Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (18:00 IST)
చాలా మందిలో కిడ్నీలో రాళ్లు చేరుతుంటాయి. ఈ రాళ్ళను తొలగించుకునేందుకు వివిధ రకాలైన వైద్యం చేయించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అస్సలు కిడ్నీలో రాళ్లు ఎలా చేరుతాయన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీనిపై ఉన్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం.
 
మానవ మూత్రంలో ఖనిజాలు, ఆమ్లాలు, ఇతర పదార్థాలన్నీ కలిసి వుంటాయి. ఇందులో కాల్షియం, సోడియం, ఆక్సలైట్, యూరిక్ యాసిడ్‌లు ఉంటాయి. మనం నీళ్లు తాగినపుడు అవి శరీరం నుంచి మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి అని శాస్త్రవేత్తలు వివరించారు. 
 
మనం తక్కువ నీరు తాగడం వల్ల కాల్షియం, సోడియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థ కణాల మోతాదు మూత్రంలో పెరిగిపోతుంది. తగినంత ద్రవం లేకపోవడం వల్ల ఆ కణాలన్నీ కలిసి అతుక్కోవడం ప్రారంభిస్తాయి. ఇలా అతుక్కున్న కణ భాగాలే కిడ్నీలలో రాళ్లుగా ఏర్పడతాయి. 
 
మరోవైపు, కిడ్నీల్లో రాళ్లు ఉండటంపై ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకుల జరిపిన అధ్యయనంలో ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధరణంగా ఉండొచ్చు. 
 
మూత్రపిండాల్లో రాళ్లు వస్తే నడుమ దిగువభాగంలో, ఉదరంలో లేదా ఉదరంలోని ఒక వైపున నొప్పిన అనిపిస్తుంది. ఈ నొప్పి నడుమ నుంచి చంకల వరకు వ్యాపించినట్టు అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు తేలిగ్గా, మరికొన్ని సార్లు మధ్యస్తంగా, ఇంకొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

తర్వాతి కథనం
Show comments