Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి-వెల్లుల్లి వాడుతున్నారా? రోజూ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు?

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (11:24 IST)
ఉల్లి-వెల్లుల్లిని రోజు వారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాల్సిందేనని వారు సూచిస్తున్నారు. వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పేగు సంబంధిత వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. అంతేగాకుండా.. తలనొప్పి, క్యాన్సర్ వంటి రోగాల్ని నివారించుకోవచ్చు.  
 
అలాగే ఉల్లిపాయలను కూడా వంటల్లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు జలుబు, జ్వరం ఏర్పడకుండా చేయడంలో ఉల్లి దివ్యౌషధం. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచడంలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది. 
 
క్యారెట్ : చర్మాన్ని పరిరక్షించడంలో క్యారెట్ బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తి బాగా పనిచేసేలా క్యారెట్ పనికొస్తుంది. 
 
ఆరెంజ్ : విటమిన్ సి దాగివున్న ఆరెంజ్‌ గాలి మరియు నీటి ద్వారా ఏర్పడే రోగాలకు చెక్ పెడుతుంది. ఆరెంజ్ లేకుంటే నిమ్మరసాన్ని రోజు అరగ్లాసు మేర తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
పప్పు దినుసులు : బాదం పప్పు, వేరు శెనగల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంది. తెలుపు రక్త కణాలను మెరుగ్గా పనిచేయిస్తాయి. తద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
గోధుమలతో రొట్టెలు : నాడీ వ్యవస్థ, మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. కొత్త సెల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. గోధుమలో విటమిన్ బి4 ఉండటంతో శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. గోధుమలతో పాటు ఆకుకూరలు, కోడిగుడ్లను కూడా తీసుకుంటూ వుండాలి. 
 
మాంసాహారంలో రొయ్యలు, చేపలు తీసుకోవడం మంచిది. వారానికోసారి రొయ్యలు, చేపల్ని ఆహారంలో తీసుకోవడం మంచిది. 
 
టీ : టీలో ఉన్న మాగ్నీషియం, ఉప్పు వ్యాధినిరోధక శక్తిని తగ్గకుండా చూస్తుంది. వేడిగా గ్లాసుడు టీని సేవించడం ద్వారా అంటువ్యాధులకు చెక్ పెట్టవచ్చు. 
 
పాల మీగడ : చీజ్‌తో పాటు పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం, మాగ్నీషియం, ఉప్పు ఉండటంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.  
 
క్యాబేజీ : పేగు సంబంధిత వ్యాధుల్ని ఆరింతలు వేగంగా నయం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది. పైన చెప్పిన పదార్థాలను రోజూ వారీగా ఆహారంలో చేర్చుకుంటే డాక్టర్లకు వెచ్చించే ఖర్చు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

Show comments