Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగన్నంలో ఉల్లిపాయ క‌లిపి తింటే... అది పెరుగుతుంద‌ట‌... తెలుసా?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు అందరూ వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కాని ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరాన

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (15:30 IST)
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు అందరూ వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కాని ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది.
 
అంతేకాదు... ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది. రెండుపూటలా పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు. ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి. 
 
ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఇది ఖచ్చితంగా మంచి నిద్రను ఇస్తుంది. జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయను తింటే జీర్ణక్రియకు సహాయం చేసే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి. ఇది తల, మెడ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రతి రోజు మజ్జిగన్నంలో ఉల్లిపాయను బాగంగా చేసుకుంటే, అస్టియోపోరోసిస్ మరియు అథెరోస్క్లెరోసిస్ నుండి రక్షణ కలుగుతుంది. ఉల్లిపాయలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచటానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి. 
 
ప్రతి రోజు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అంతేకాక మంచి కొలస్ట్రాల్ ను పెంచి కొరోనరీ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. దంతాల నొప్పి మరియు పిప్పి పన్ను నొప్పి నివారణకు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే చాలు. పెరుగన్నంలో లేదా మజ్జిగన్నంలో ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి మరియు ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది మజ్జిగన్నంతో ఉల్లిపాయ తింటే యవ్వనంగా ఎప్పటికి మగతనం తగ్గకుండా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

తర్వాతి కథనం
Show comments