Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి చోట పెరుగు రాస్తే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (23:13 IST)
ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉరుకులు-పరుగులమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఉదర సంబంధిత జబ్బులతో బాధపడుతుండటం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి వారు తాము తీసుకునే ఆహారంలో పెరుగును తగినంత మోతాదులో తీసుకుంటుంటే ఎలాంటి జబ్బులు దరిచేరవంటున్నారు డైటీషియన్లు. 
 
అత్యుత్తమమైన, లాభం చేకూర్చే బ్యాక్టీరియా పెరుగు ద్వారా లభిస్తుంది. ఇవి శరీరానికి పలు రకాలుగా లాభాలను చేకూరుస్తాయి. ఉదరంలోని పేగులకు అత్యుత్తమమైన బ్యాక్టీరియా అందకపోతే ఉదర సంబంధమైన పలు జబ్బులు వెంటాడుతాయి. ఇందులో ప్రధానంగా ఆకలి వేయకపోవడం, అల్సర్, కడుపునొప్పి తదితర జబ్బులకు కేంద్ర బిందువు ఉదరమేనంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. 
 
దీంతో యాంటీబయోటిక్ థెరపీ సందర్భంగా భోజనం ద్వారా తీసుకునే విటమిన్లు, ఖనిజాలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి సమయంలో పెరుగు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. దీంతో ఉదరంలో తలెత్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చంటున్నారు వైద్యులు. పెరుగు తీసుకోవడం వలన శరీరానికి అందవలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతోపాటు శరీర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
కొందరికి తరచూ నోట్లో పుండు ఏర్పడటం లేదా పొక్కులు ఏర్పడటం జరుగుతుంటాయి. ఇలాంటి వారు ప్రతి రోజు రెండు నుంచి నాలుగుసార్లు నోట్లో పుండున్న చోట పెరుగు పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. పెరుగు తీసుకోవడం వలన శరీరంలోని రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచేందుకు తెల్ల రక్త కణాలు ఎంతగానో తోడ్పడుతాయి. 
 
తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ మనిషి పెరుగును తీసుకుంటుండాలి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చాలాకాలంగా పలు జబ్బులతో బాధపడే వారు తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీబయోటిక్ థెరపీ ఇచ్చే సందర్భంలో నియమానుసారం పెరుగు తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తుంటారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments