Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాస్మాటిక్స్ క్రీములతో గర్భస్థ శిశువుకు హానికరం!

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (16:49 IST)
ప్రస్తుత కాలంలో మహిళలు అందంగా కనిపించేందుకు నానాతంటాలు పడుతుంటారు. ఇందుకోసం మార్కెట్‌లోకి వచ్చే వివిధ రకాల సౌందర్య అలంకరణ పదార్థాలు, క్రీములను వాడుతుంటారు. ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మహిళలు వాడే వివిధ రకాల కాస్మెటిక్స్ వల్ల గర్భంలోని శిశువుకు కూడా హాని కలుగుతున్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా వివిధ రకాల క్రీమ్‌లు, పర్ఫ్యూమ్‌లు, వంటి కాస్మాటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది తల్లికే తెలియకుండా గర్భంలోకి వెళ్లి గర్భంలో పెరిగే పసికందుపై ప్రభావం చూపుతుందట.
 
అందులోనూ ముఖ్యంగా తల్లి కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అయితే, ఆ బిడ్డపై ఎక్కువ దుష్ఫలితాలు చూపిస్తున్నాయట. ఎనిమిదో వారం నుంచి 12వ వారం వరకు గల మధ్యకాలంలో గర్భంలో పెరిగే పిండంలో అవయవాల పెరుగుదల కనిపిస్తుందని, ఇలాంటి సమయంలో కొన్ని హార్మోన్లు పిండంపై ప్రభావం చూపడం వల్లే జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి లోపాలు కనిపిస్తాయట. ఇవి ఎక్కువగా మగ పిల్లల్లోనే కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో తల్లి ఉపయోగించే అలంకరణ వస్తువులు బిడ్డ యొక్క హార్మోన్ల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట. 
 
టెస్ట్రోస్‌రోన్ అనే హార్మోన్ మగవారిలో పునరుత్పత్తిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమైంది. దీనిపైనా ఈ సౌందర్య పదార్థాలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ సౌందర్య వస్తువులను మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందట. అందువల్ల గర్భం దాల్చిన మహిళలు ప్రసవం అయ్యేంత వరకు సౌందర్య క్రీములకు కాస్త దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

Show comments