Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాకాహారులు ఆరగించే ప్రతి ఆహార పదార్థం మాసాహారంతోనే తయారైనవే.. తెలుసుకోండి?

మీరు పుట్టుకతోనే శాకాహారులా... శాకాహారం తప్ప మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోరా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే శాకాహారం అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా ఎంతో కొంత మాంసాహారం కలుస్తుందని మీకు

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (12:23 IST)
మీరు పుట్టుకతోనే శాకాహారులా... శాకాహారం తప్ప మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోరా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే! ఎందుకంటే శాకాహారం అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా ఎంతో కొంత మాంసాహారం కలుస్తుందని మీకు తెలుసా... శాకాహారంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాల్లో ఎంత లేదన్నా కొంత మాంసం లేదా దాని సంబంధ పదార్థాలు కొంతవరకైనా కలిసుంటాయట. అవేంటో ఇప్పుడు చూద్దామా...
 
చక్కెరని తయారు చేసేటప్పుడు దాని శుద్ధీకరణ కోసం సహజసిద్ధమైన నాచురల్ కార్బన్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడే విషయం అంతా ఉంది. ఆ నాచురల్ కార్బన్‌ను జంతువుల ఎముకలను కాల్చడం ద్వారా తయారు చేస్తారు. అంటే చక్కెర కూడా మాంసాహార సంబంధ పదార్థమేనని చాలా మందికి తెలీదు.
 
అందరూ నోరూరించుకుని తినే ఫ్రెంచ్ ఫ్రైస్‌లోనూ మాంసపదార్థాలు కలుస్తాయట. బీఫ్ కొవ్వు నుంచి తీసిన కొన్ని పదార్థాలను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేయడానికి వినియోగిస్తారు.
 
బీర్, వైన్ వంటి ఆల్కహాల్ డ్రింక్స్‌లోనూ మాంసం లక్షణాలు లేకపోలేదు. ఫిష్ బ్లాడర్, జంతువుల ఎముకలు, లిగ్‌మెంట్స్ నుంచి తీసిన పలు పదార్థాలను ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ తయారీలో వాడతారట. 
 
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న బ్రెడ్‌ని చిన్నా పెద్దా తేడా లేకుండా తింటారు. అయితే వాటిలో చేపల ఆయిల్‌తోపాటు, అవిసె గింజలు, మనిషి, పంది, కోడి వెంట్రుకల నుంచి తీసిన ఎల్-సిస్టీన్ అనే పదార్థాలను ఉపయోగిస్తారట.
 
రెస్టారెంట్లలో సూప్‌లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే వాటి తయారీలో వాడే సాస్‌లలో చేపల నుంచి తీసిన పదార్థాలను వాడతారట.
 
జంతువుల మాంసం నుంచి తీసిన గెలాటిన్ అనే పదార్థం జెల్లీల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం అధిక శాతం జెల్లీల్లో గెలాటిన్‌కు బదులుగా ఇతర పదార్థాలను వాడుతున్నారు. కాబట్టి కొంత వరకు సేఫ్‌గానే ఉండవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

తర్వాతి కథనం
Show comments