Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు జలుబు చేసిందా.. దయచేసి ఆఫీసుకు వెళ్లొద్దు ప్లీజ్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2015 (15:47 IST)
వర్షాకాలం ఆరంభమైంది. ఈ కాలంలో చిన్నపాటి వర్షానికి తడిస్తే జలుబు చేస్తుంది. అయినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా ఆఫీసుకు వెళుతుంటారు. నిజానికి తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు. 
 
ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. అందువల్ల జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణుల చెపుతారు. 
 
జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
 
చీదినప్పుడు, దగ్గినప్పుడు రక్తం పడుతుందా...? అని గమనించాలి. అలా రక్తం పడితే అది తీవ్రమైన రుగ్మతగా గమనించాలి. స్వల్పంగా తలనొప్పి, జలుబు అయినప్పుడు తగినంత విశ్రాంతి అన్నిటికి మంచిది.   
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

Show comments