Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెకు మేలు చేసే కొబ్బరి పాలు (video)

మనం రోజూవారీగా తీసుకునే ఆహారంలో పోషకాలెన్నో దాగివున్నాయి. అలాగే వంటల్లో వాడే కొబ్బరిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలున్నాయి. ముఖ్యంగా కొబ్బరి నుంచి తీసే పాలలో పుష్కలమైన విటమిన్లు వున్నాయి. కొబ్బరి పా

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (17:48 IST)
మనం రోజూవారీగా తీసుకునే ఆహారంలో పోషకాలెన్నో దాగివున్నాయి. అలాగే వంటల్లో వాడే కొబ్బరిలోనూ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలున్నాయి. ముఖ్యంగా కొబ్బరి నుంచి తీసే పాలలో పుష్కలమైన విటమిన్లు వున్నాయి. కొబ్బరి పాలలో పీచు, విటమిన్, సీ,ఇ.బీ1, బీ3, బీ6, ఐరన్, సెలీనియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలుంటాయి.
 
కొబ్బరి పాలలో లాక్టోస్ లేకపోవడంతో పాలంటే ఇష్టపడని వారికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరిపాలలోని లారిక్ యాసిడ్.. బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపచేస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఇంకా వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొబ్బరి పాలలో కొవ్వు వున్నప్పటికీ ఆరోగ్యానికి మేలే చేస్తుంది.
 
ఇందులోని మీడియం చైన్ ఫాటీ యాసిడ్ ద్వారా గుండె గోడల్లో కొవ్వు చేరనీయకుండా అడ్డుకుని హృద్రోగాల బారిన పడకుండా తప్పిస్తుంది. కొబ్బరి పాలలో మెగ్నీషియం, క్యాల్షియం వుండటంతో నరాల వ్యవస్థకు, ఎముకలకు బలాన్నిస్తుంది. ఇవి కండరాల్లో ఏర్పడే నొప్పిని దూరం చేస్తాయి. కొబ్బరి పాలు రక్తహీనతను తగ్గిస్తుంది. ఒక కప్పు కొబ్బరిపాలలో శరీరానికి అవసరమయ్యే 25 శాతం ఐరన్ లభిస్తుంది. కాబట్టి కొబ్బరి పాలను వారానికి రెండుసార్లు తీసుకుంటే ఆరోగ్యానికి తగిన పోషకాలు అందినట్టేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

తర్వాతి కథనం
Show comments