Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రి పూట తీసుకుంటే?

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (19:30 IST)
వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు. వీటిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో విటమిన్లు, ఐయోడిన్ వంటివి ఉన్నాయి. 100 గ్రాముల వెల్లుల్లిలో నీటి శాతం 62 శాతం ఉండగా, కార్బొహైడ్రేట్స్ 29.9 శాతం, ప్రోటీన్ 6.3 శాతం, కొవ్వు 0.1 శాతం, ధాతువులు 1.0 శాతం, పీచు పదార్థం 0.8 శాతం ఉంటుంది. ఇంకా కాల్షియం 30 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 310 మి.గ్రాములు, ఐరన్ శక్తి 1.3 మి.గ్రాములు, విటమిన్ సీ 13 మిల్లీ గ్రాములు, బి విటమిన్ కూడా ఇందులో ఉంది. 
 
వెల్లుల్లిలోని వాసనకు కారణం అందులోని సల్ఫర్. వెల్లుల్లిలో నీటి ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, సైనస్‌ను నివారిస్తుంది. టీబీతో బాధపడే వారు ఒక గ్లాసు పాలతో ఒక గ్లాసు నీరు, పది మిరియాలు, కొంచెం పసుపు పొడి, ఒక వెల్లుల్లి బెరడును వేసి కాసేపు వేడి చేసి దానిని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వెల్లుల్లితో కాచిన పాలను ఉదయం, రాత్రి పూట తీసుకుంటే జలుబు, దగ్గు, వాతం వంటి వ్యాధులన్నీ నయం అవుతాయి. ఈ పాలు తాగి జలుబు తగ్గిపోతే రెండు పూటల తాగడాన్ని ఆపేయాలి. అలాగే ఈ పాలను ఆస్తమా వ్యాధిగ్రస్తులు సేవిస్తే శ్వాసప్రక్రియ సక్రమమవుతుంది. 
 
అలాగే వెల్లుల్లి మనం తీసుకునే ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు, వైరస్ వంటివి తొలగిపోతాయి. ఇంకా రక్త కణాలను వెల్లుల్లి శుభ్రపరుస్తుందని, అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీంతో మన శరీరానికి తగిన ఆక్సిజన్ లభించడంతో ఒత్తిడి మాయమవడంతో పాటు నరాల పనీతీరు, శ్వాసప్రక్రియ క్రమమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments