ఆస్తమాను అదుపు చేసే నల్లద్రాక్ష

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (11:31 IST)
పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. నల్లద్రాక్షలో మన శరీరానికి కావలసిన పోషకాలు చాలా ఉన్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ద్రాక్ష రసం ఆరోగ్యానికే కాక చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు ద్రాక్ష రసం త్రాగడం వల్ల అందమైన, ప్రకాశవంతమై చర్మాన్ని సహజసిద్ధంగా పొందవచ్చు. 
 
ద్రాక్షలో విటమిన్ సి, ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షలో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఫ్లేవనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 
 
ద్రాక్ష ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది. ద్రాక్ష పండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. నల్లద్రాక్ష రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. 
 
క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తాయి. రోజూ ఒక గ్లాసు తాజా ద్రాక్ష రసంను త్రాగడం వల్ల అసిడిటీ తగ్గుతుంది. అజీర్తితో బాధపడేవారు ద్రాక్షను తింటే మంచిది. ద్రాక్షలో ఉండే సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడతాయి.
 
చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments