Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ తగ్గాలంటే.. పెరుగు తీసుకోవాల్సిందే.. కానీ ఆ రెండు..?

మధుమేహాన్ని దూరం చేసుకోవాలంటే రోజువారీ ఆహారంలో పెరుగును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొవ్వు త‌క్కువగా ఉన్న పెరుగుని తీసుకోవ‌టం ద్వారా శ‌రీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది షుగర

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (10:00 IST)
మధుమేహాన్ని దూరం చేసుకోవాలంటే రోజువారీ ఆహారంలో పెరుగును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొవ్వు త‌క్కువగా ఉన్న పెరుగుని తీసుకోవ‌టం ద్వారా శ‌రీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది షుగర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే చీజ్‌లోనూ ఇలాంటి ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇదేవిధంగా రోజూ స్ట్రాబెర్రీస్‌ను తీసుకోవం ద్వారా ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని, కొవ్వుల‌ను త‌గ్గించే శ‌క్తిని పొందవచ్చు. ఈ పండ్ల ద్వారా ప్రొటీన్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌, కొవ్వులు త‌గ్గ‌ుతాయి. దీంతో మ‌ధుమేహం ముప్పు త‌గ్గుతుంది. దాల్చిన చెక్క పొడిని టీలో చేర్చుకుని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. దాల్చిన చెక్కలోని ట్రైగ్లిజ‌రైడ్స్ అనే కొవ్వుల‌ను, చెడు కొలెస్ట్రాల్‌ని త‌గ్గించి ఇన్సులిన్‌ ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. 
 
అలాగే రోజుకొకటి చొప్పున యాపిల్ తీసుకోవాలి. ఇందులోని అంథోసియానిన్ ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్‌ని క్ర‌మ‌బ‌ద్ధం చేస్తుంది. పాలకూర తింటే మధుమేహం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అయితే అరటి పండ్లు, ఖర్బూజలను మాత్రం మధుమేహంతో బాధపడేవారు తీసుకోకూడదు. ఇందులోని విటమిన్స్, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేసినా.. వీటిలో షుగర్ శాతం ఎక్కువగా వుండటం ద్వారా డయాబెటిస్ పేషెంట్లకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments