Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పుతో దుష్ఫలితాలే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో :: ఒత్తిడి - ఎసిడిటీని తగ్గిస్తుంది

మనం ప్రతి రోజు ఆహారానికి ఉపయోగించేవాటిలో ముఖ్యమైనది ఉప్పు. ఉప్పు లేకపోతే కూరలు రుచికరంగా ఉండవు. మన శరీరానికి ఉప్పు లేకపోయినా, అధికంగా ఉన్నా రెండు ఇబ్బందే కానీ, ఈ మధ్య చేసిన అధ్యయనాలు ఉప్పును తీసుకోవడం

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:29 IST)
మనం ప్రతి రోజు ఆహారానికి ఉపయోగించే వాటిలో ముఖ్యమైనది ఉప్పు. ఉప్పు లేకపోతే కూరలు రుచికరంగా ఉండవు. మన శరీరానికి ఉప్పు లేకపోయినా, అధికంగా ఉన్నా రెండు ఇబ్బందే కానీ, ఈ మధ్య చేసిన అధ్యయనాలు ఉప్పును తీసుకోవడం వల్ల కలిగే లాభలు గురించి మరిన్నీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరానికేకాకుండా అన్ని విధాలుగా ఉపయోగపడే ఉప్పు యొక్క ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 
ఉప్పు అత్యధిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. ఒత్తిడిని కలిగించే కోర్టిసోల్, అడ్రెనలైన్ హార్మోన్స్‌ని నియంత్రించి చక్కని నిద్ర వచ్చేలా చేస్తుంది.
 
మన దినచర్యలో ప్రతి రోజు ఉప్పు తీసుకోవడం వల్ల ఎసిడిటీని నియంత్రిస్తుంది.
 
వంటింటి గట్టును శుభ్రం చేయడానికి దానిపై ఉప్పూ, సర్ఫు చల్లాలి. కాసేపయ్యాక గుడ్డతో శుభ్రం చేస్తే... మరకలూ, ఇతర క్రిములూ దూరమవుతాయి. చీమల రంధ్రాలున్న చోట.. రాళ్లుప్పు అక్కడక్కడా చల్లాల్లి. చీమల బెడద తొలగిపోతుంది.
 
సాధారణంగా వెల్లుల్లి పొట్టు తీసినప్పుడు చేతులకు వాసన అంటుకుంటుంది. చేతులను కడిగినా కూడా వాసన పోదు. అది త్వరగా వదిలిపోవాలంటే... నిమ్మరసంలో ఉప్పు వేసి దాంతో చేతులు కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
కట్ చేసి పెట్టిన యాపిల్‌ ముక్కలు నల్లగా మారకుండా ఉండాలంటే వాటిని ఉప్పు నీళ్లలో ఉంచితే సరి. బంగాళాదుంప ముక్కలు కూడా మిగిలిపోతే వాటిని ఐస్ నీళ్లలో వేసి.. కాస్త ఉప్పు చేర్చి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలాచేయడం వల్ల అవి తాజాగా ఉండటమే కాదు, రంగూ మారకుండా ఉంటుంది.
 
నిమ్మరసంలో ఉప్పు కలిపి తుప్పు ఉన్న చోట శుభ్రం చేస్తే అది వదిలిపోయి మామూలుగా అవుతుంది. దుస్తులపై తుప్పు మరకలు పడినా ఇలా చేయొచ్చు.
 
ఓవెన్‌లో పదార్థాలు మాడిపోయినా, పడిపోయినా వాసన వస్తుంటుంది. అందులో కాస్త రాళ్లుప్పు చల్లి అరగంటయ్యాక తుడిచేస్తే మరకలు వదిలిపోతుంది.
 
పాదాలలో మంట, నొప్పిగా ఉండి ఇబ్బంది కలుగుతుంటే... గోరువెచ్చటి నీళ్లలో కాస్త ఉప్పు, బేకింగ్‌ సోడా కలిపి అందులో కాళ్లను ఉంచితే నొప్పి త్వరగా తగ్గిపోయి ఉపశమనం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

తర్వాతి కథనం
Show comments