Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం పాలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో...

బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే కాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి పైన ఉన్న పొరల

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (17:47 IST)
బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే కాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసివేసి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుంది. 
 
బాదం పాలు ఎలా తయారు చేసుకోలంటే, బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలుపుకోవాలి. అంతే బాదం పాలు రెడీ. బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. అందుకే మీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదం మిల్క్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉండటం వలన హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఫిష్‌లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో అధికంగా ఉంది. అందువల్ల ఇది గుండె సంబంధిత వ్యాధులను, రక్తపోటును తగ్గిస్తుంది. బాదం పాలు కండరాలు బలోపేతం అవుతాయి. నొప్పులను నివారిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. ఇంకా జ్ఞాపకశక్తిని పెంపొందింపజేసేందుకు చాలా ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments