యాపిల్ టీ తాగితే.. ఇన్ఫెక్షన్లు పరార్..

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:34 IST)
టీపై మక్కువ ఉన్నవాళ్లు లెమన్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ అంటూ చాలా రకాల టీలు త్రాగుతుంటారు. అలాంటి వారు ఎప్పుడైనా యాపిల్ టీ గురించి విన్నారా? ఈ టీ ఇప్పటికే యూరప్‌లో ఎంతో ప్రజాదరణ పొందింది. రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని మనకు తెలుసు. యాపిల్ టీని త్రాగడం వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు న్యూట్రీషియనిస్టులు. 
 
ఈ టీ చాలా రుచిగా ఉండటంతోపాటు శరీరం ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలకు యాపిల్ టీ చక్కటి ఔషధం. 
 
యాపిల్ టీ రోజూ తీసుకుంటే సౌందర్యం పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. జాయింట్ పెయిన్ సమస్యలను నివారిస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని మరిగించాలి.
 
మరుగుతున్న నీటిలో శుభ్రపరిచిన యాపిల్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత తగినంత టీ పొడి, లవంగ దాల్చిన చెక్కపొడి వేసి కాసేపు మరిగించాలి. తర్వాత దించి వడపోసి కొద్దిగా తేనె కలుపుకుని త్రాగాలి. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో యాపిల్ టీని త్రాగటం వలన సౌందర్యంతో పాటు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments