Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో ఆపిల్ తింటే నోటి దుర్వాసన సమస్య మటాష్

శరీరంలో వేలాది నాడులు పలు జీవక్రియల నిర్వహణలో చురుగ్గా పనిచేస్తుంటాయి. ఈ నాడుల పనితీరుకు అవసరమైనంత గ్లూటామిక్‌ ఆసిడ్‌ మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (13:17 IST)
శరీరంలో వేలాది నాడులు పలు జీవక్రియల నిర్వహణలో చురుగ్గా పనిచేస్తుంటాయి. ఈ నాడుల పనితీరుకు అవసరమైనంత గ్లూటామిక్‌ ఆసిడ్‌ మన శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ఆమ్లం నాడీ కణాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుతుంది.


ఏదైనా కారణం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటే నిస్త్రాణ, మతిమరుపు, అనాశక్తి, చికాకు, క్షణకోద్రేకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రోజుకో ఆపిల్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
యాపిల్‌లోని మిటమిన్‌ ఎ, సి, ఫాస్పరస్‌, పొటాషియంలతో పాటు ఖనిజ లవణాలు ఆరోగ్యానికి దోహదపడతాయి. ఆపిల్‌లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు అతి తక్కువగా ఉంటాయి. ఇవి బరువును పెరగనీయకుండా చేస్తాయి.
 
ఆపిల్‌ను ముక్కలుగా కొరికి తింటేనే మంచిది. దీనివల్ల దంతాలు, చిగుళ్ళు బలపడతాయి. దంతాల మీది ఎనామిల్‌ కూడా ఎక్కువకాలం దెబ్బతినకుండా ఉంటుంది. రోజుకో ఆపిల్ తింటే నోటి దుర్వాసన సమస్య రాదనీ, ఉన్నా తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఆపిల్‌ను రోజుకొకటి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా హృద్రోగ ముప్పు వుండదు. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments