Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతు బొంగురు పోయిందా.. యాలకులతో ఉపశమనం పొందడమెలా?

Webdunia
బుధవారం, 4 మే 2016 (16:44 IST)
కొందరు నోరు శుభ్రంగా ఉంచుకునేందుకు యాలకలను నోట్లో వేసుకుంటుంటారు. ఇవి రెండు రకాలలో లభిస్తుంటాయి. చిన్న యాలకులు లేదా పెద్ద యాలకులు. పెద్ద పెద్ద యాలకలు తినుబండారాలలో సువాసనలు వెదజల్లేందుకు ఉపయోగిస్తుంటారు. అదే చిన్న యాలకలు తీపి పదార్థాలలో కలుపుతుంటారు.  
 
మనం తినే ఆహార పదార్థాలలో మాత్రమే వీటిని ఉపయోగించుకుంటామనుకుంటే పొరపడినట్లే. ఇందులో ఔషధ గుణాలున్నాయి. ఆ ఔషధ గుణాలేంటో చూద్దాం. 
 
వాంతులు : వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకలను వేసి ఉడకబెట్టండి. బాగా కాగిన తర్వాత నీరు 1/4వ వంతు వచ్చినప్పుడు తీసి ఆ నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది. దీంతో మంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణలు. 
 
గొంతులో గరగర : దగ్గుతో ఇబ్బంది పడి గొంతులో (కిచ్ కిచ్) మంట, బొంగురు పోయినట్లుంటే ఉదయం లేవగానే యాలకలను నమిలి తినండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగండి. ఉపశమనం కలుగుతుంది. 
 
వాపు : గొంతులో వాపు సంభవిస్తే ముల్లంగిని నానబెట్టిన నీటిలో యాలకలను రుబ్బి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
దగ్గు : వర్షాకాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలావున్నప్పుడు యాలకలు, అల్లం ముక్క, లవంగ మరియు ఐదు తులసి ఆకులు కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
నోట్లో పొక్కులుంటే : నోట్లో పొక్కులుంటే యాలకలతోపాటు కలకండను కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నాలుకపై ఉంచుకోండి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ పెద్దమనిషి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు: అంబటి రాంబాబు

కాశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి: నా భర్త తలపై కాల్చారు, కాపాడండి- మహిళ ఫోన్

Shyamala : పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్.. శ్యామల ఫైర్

జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం

ఇండోర్‌లో విజృంభించిన కరోనా.. కడుపు నొప్పితో వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

తర్వాతి కథనం
Show comments