Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఉదయం మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి తీసుకుంటే...(Video)

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (11:57 IST)
ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేయగల దినుసులు మన ఇంట్లోనే వున్నాయి. వాటిలో మిరియాలు కూడా వుంటాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులు, మోకాళ్ల నొప్పికి మిరియాలు చెక్ పెడుతుంది. గొంతునొప్పి, ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. మిరియాల పొడి 50 గ్రాములు తీసుకుని అందులో 600 మి.లీటర్ల నీరు చేర్చి 30 నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ నీటిని వడగట్టి రోజూ మూడు పూటలూ 25 మి.లీ చొప్పున తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.  
 
జుట్టు రాలిపోతుంటే మిరియాల పొడి, ఉప్పు, ఉల్లపాయలు మూడింటిని సరిపాళ్ళతో తీసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని జుట్టు పెరగని చోట రాస్తే జుట్టు పెరుగుతుంది. జ్వరం. జలుబుకు ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
మిరియాలు ఉదరంలోని వాతాన్ని తొలగించి శరీరానికి ఉష్ణాన్ని ఇవ్వడంతో పాటు వాపులను నయం చేస్తుంది. మిరియాల పొడిని ఉప్పుతో కలిపి బ్రష్ చేసుకుంటే పంటినొప్పి, పళ్ళు పుచ్చిపోవుట, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసను నిరోధించవచ్చు. అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే తలభారం, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

తర్వాతి కథనం
Show comments