Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితో మేలెంత? రోజూ అరకప్పు మామిడి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (17:51 IST)
మామిడి కాయల సీజన్.. నోరూరించే మామిడి.. ఎక్కువగా తింటే వామ్మో వేడి చేస్తుందని భయపడుతున్నారా? ఊరకే రెండు ముక్కలు మాత్రం టేస్ట్ చేసి పక్కనబెట్టేస్తున్నారా..? అలాంటి వారు మీరైతే ఈ స్టోరీ చదవండి.

మామిడి మాత్రమే కాదు.. సీజన్లలో లభించే పండ్లను పక్కనబెట్టేయకుండా తీసుకోవడం ద్వారా శరీరానికి ఆ సీజన్‌కు అనుగుణమైన పోషకాలు లభిస్తాయని.. అందుకే సమ్మర్లో లభించే మామిడి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు.. న్యూట్రీషన్లు. మామిడిలో విటమిన్ ఎ, థయామిన్, నయాసిన్, బి విటమిన్లున్నాయి. అంతేగాకుండా క్యాల్షియం, ఫాస్పరస్, పీచు పదార్థాలున్నాయి. 100 గ్రాముల మామిడి పండ్లలో 44 కెలోరీల శక్తి లభిస్తుంది.  
 
వంద గ్రాముల మామిడి తీసుకోవడం ద్వారా 99 మైక్రో గ్రాముల విటమిన్ ఎ లభిస్తుంది. సాలడ్స్‌లో మామిడిని చేర్చి తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మామిడిలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ-యాక్సిడెంట్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. కోలన్, బ్రెస్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్లను ఇది నియంత్రిస్తుంది. మామిడిలోని విటమిన్ ఎ నరాలకు, కండరాలకు, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
తాజా మామిడిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పండులో 156 ఎంజీ పొటాషియం దాగివుంది. ఈ పొటాషియం గుండెను రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా మామిడిలో విటమిన్ -బి6, విటమిన్-సి, ఇలున్నాయి. బి6 ద్వారా హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. విటమిన్ సి ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిని రోజూ అరకప్పు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. 
 
మామిడి బ్లాక్ హెడ్స్‌ని, వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. క్లెన్సర్‌గా పనిచేస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా డయాబెటిస్‌ను దూరం చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments