Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌ 19 నుంచి కోలుకున్న వేళ మీకు సహాయపడే మూడు జీవనశైలి మార్పులు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (19:28 IST)
ఈ ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ 19 వైరస్‌ మహమ్మారితో పోరాడి మీరు కోలుకున్నట్లయితే, ఓ యుద్ధవీరుడికి మీరు తక్కువేం కాదు. ఆ యుద్ధ వీరుల్లాగానే, మీరు కూడా కోలుకునే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. అయితే అదంత సులభమేమీ కాదు. కానీ, మీ రోజువారీ కార్యక్రమాలలో కొద్ది పాటి జీవనశైలి మార్పులు చేసుకుంటే, మీరు మీ రికవరీ ప్రక్రియను మరింత వేగవంతం చేసుకోవచ్చు!
 
మీరు తీసుకునే ప్రోటీన్‌ను పెంచుకోవడం ద్వారా కోల్పోయిన కండరాలను తిరిగి పొందవచ్చు
కణజాల వృద్ధికి, కండరాల పునరాభివృద్ధికి తోడ్పడే అతి ముఖ్యమైన పోషకాలలో ఒకటి ప్రొటీన్‌. శరీర నిర్మాణానికి అతి కీలకమైన పోషకంగా దీనిని గుర్తించారు. ప్రొటీన్‌లలో ఉండే అమినో యాసిడ్స్‌ అత్యంత ప్రమాదకరమైన సూక్ష్మజీవుల నుంచి మనల్ని కాపాడతాయి.
 
అందువల్ల, కోవిడ్‌ 19 కారణంగా మన శరీరంలో ప్రొటీన్‌ తగ్గడమంటే, మనలో రోగనిరోధక శక్తి కూడా తగ్గడమే అని అర్థం. ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దాదాపు 75 నుంచి 100 గ్రాముల ప్రొటీన్‌ను ప్రతి రోజూ తీసుకోవడం సూచనీయం.  వ్యాధి తీవ్రతను అనుసరించి అది ఉంటుంది. రోజులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ మొత్తం ఒక్కసారే తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. దానికి బదులుగా ఆ మొత్తాన్ని రోజంతా తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది.
 
దాల్‌ (పప్పు), పాలు, పాల పదార్ధాలు, కొవ్వు లేని మేక మాంసం, చికెన్‌, చేపలలో అధికంగా ప్రొటీన్‌ ఉంటుంది. మీ డైట్‌లో గుడ్లు, పన్నీర్‌ను కూడా భాగం చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిని భాగం చేసుకోవడం లేదా మధ్యాహ్న భోజన సమయంలో కర్రీగా కూడా వాటిని తీసుకోవచ్చు. అలాగే మీ డైట్‌ ప్లాన్‌లో బాదములు లాంటి గింజలను కూడా భాగం చేయాలి. బాదములలో విటమిన్‌ ఈ అధికంగా ఉంటుంది. శ్వాసకోశ రోగనిరోధక వ్యవస్ధకు మద్దతునందించడంలో  యాంటీ ఆక్సిడెంట్‌గా ఇది పనిచేస్తుంది. వైరస్‌ మరియు బ్యాక్టీరియా వల్ల ఎదురయ్యే అంటువ్యాధుల నుంచి రక్షణను సైతం అందించడంలో విటమిన్‌ ఈ తోడ్పడుతుంది.
 
ఎక్కువగా నీరు తీసుకోవాలి
శరీరానికి తగినంతగా ద్రవాహారం అందించడం ద్వారా ఎలాంటి అనారోగ్యం నుంచి అయినా కోలుకునేందుకు అతి ముఖ్యం. మన శరీర బరువులో 55% నీరు ఉంటుంది. సూపులు, కొబ్బరి నీళ్లు, తాజా నిమ్మనీళ్లు, షేక్స్‌ మొదలైనవి తీసుకోవడం వల్ల అనారోగ్య సమయంలో మాత్రమే కాదు కోలుకునే దశలో కూడా అత్యుత్తమ హైడ్రేషన్‌ను అందిస్తుంది.
స్నాక్‌ను సరిగా తీసుకోండి
అధిక మొత్తంలో పండ్లు, కూరగాయలు, బాదములు లాంటి గింజలు తీసుకోవడం ద్వారా మీ రోగ నిరోధకశక్తిని మెరుగుపరుచుకోవడం మాత్రమే కాదు ప్రతి రోజూ తీసుకోవాల్సిన విటమిన్‌ సీ, జింక్‌ కూడా లభ్యమవుతుంది. రోగ నిరోధక వ్యవస్ధలో అత్యంత కీలకమైన పాత్రను జింక్‌ పోషిస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపొందించే కణజాలం సాధారణంగా వృద్ధి చెందడానికి, న్యూట్రోఫిలిస్‌, సాధారణ కిల్లర్‌ కణజాలం వృద్ధిలో కూడా ఇది కీలకం. అంతేకాదు, మహమ్మారి నుంచి కోలుకున్న రోగులకు అత్యధిక ఔషద మోతాదు కారణంగా ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది.
 
అనారోగ్యకరమైన స్నాక్స్‌కు చక్కటి సబ్‌స్టిట్యూట్‌గా బాదములు నిలుస్తాయి. భోజనాల నడుమ చిరుతిండిగా ఇది ఉపయోగపడటంతో పాటుగా కాస్త తిన్నప్పటికీ కడుపు నిండిందన్న భావనను కలిగిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్‌ లీడ్స్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. బాదములలో అతి తక్కువగా గ్లిసెమిక్‌ ఇండెక్స్‌ ఉంది. దీనిలో అత్యంత శక్తివంతమైన పోషకాలైనటువంటి ఆకలితో పోరాడే ప్రొటీన్‌, ఫైబర్‌, చక్కటి కొవ్వు, అతి ముఖ్యమైన విటమిన్స్‌, మినరల్స్‌ అయినటువంటి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి. ఇతర ఆరోగ్యవంతమైన స్నాక్స్‌లో తాజా పళ్లు, ఉడికించిన జొన్నలు, మొలకలు వంటివి ఉంటాయి.
 
మీ బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలను నియంత్రించండి, సమస్యలను నివారించండి
కోవిడ్ 19 చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ వినియోగించడం ఓ పద్ధతి. ఈ కారణంగానే హైపర్‌గ్లిసేమియాకు కారణమవుతుంది. దీనిని నియంత్రించకపోతే అది కోవిడ్‌ అనంతరం సమస్యగా  పరిణమించే అవకాశం ఉంది. అందువల్ల,కోవిడ్‌ చికిత్సతో పాటుగా అనంతర కాలంలో బ్లడ్‌ షుగర్‌ నియంత్రించడం అవసరం. బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలను నియంత్రించడంలో డైట్‌, జీవనశైలి మార్పులు అత్యంత కీలకం.
 
ఈ చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ఇండోర్‌ వ్యాయామాలతో పాటుగా యోగా కూడా సహాయపడుతుంది. మీ డైట్‌కు తగినట్లుగా ఆకుకూరలు, కూరగాయలు, పాలకూర వంటివి భాగం చేసుకోవాలి. ఇవి అవసరమైన విటమిన్స్‌ కలిగి ఉండటంతో  పాటుగా మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాదు, బ్రౌన్‌ రైస్‌, తృణ ధాన్యాలు, క్వినోవా వంటి వాటిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మది చేయడంతో పాటుగా పోషకాలను గ్రహించడమూ మెరుగుపరుస్తుంది. బ్లడ్‌ షుగర్‌ స్థాయి స్థిరంగా ఉంచడంలోనూ ఇది సహాయపడుతుంది. పండ్ల దగ్గరకు వచ్చేసరికి నిమ్మజాతి పండ్లు ఉత్తమం. వీటిలో అధికంగా విటమిన్‌లు ఉండటంతో పాటుగా కార్బోహైడ్రేట్స్‌ తక్కువ స్థాయిలో ఉంటాయి. బాదములు లాంటి గింజలు మీకు ఎప్పుడూ మేలు చేస్తూనే ఉంటాయి.
 
-రితికా సమద్ధార్‌, రీజనల్‌ హెడ్ డైటెటిక్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌-ఢిల్లీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

తర్వాతి కథనం
Show comments