Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుండ్రును నివారించే తమలపాకులు

Betel Leaf
Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:20 IST)
హిందువులు పెళ్ళిళ్లలో, శుభకార్యాలలో ప్రధానంగా ఉపయోగించే తమలపాకు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తలనొప్పితో బాధపడేవారు లేత తమలపాకును నుదుటిపై పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఎముకలు పటిష్టంగా ఉండటానికి అవసరమైన కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్స్ తమలపాకులో సమృద్ధిగా ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా తమలపాకుకు ఉంటుంది. వృద్ధాప్య చాయలు కనిపించకుండా ఉండాలంటే తరచుగా తమలపాకులు తినండి. వీటిలో ఎసెన్షియల్ ఆయిల్ అధికంగా ఉంటుంది. అది ఫంగస్ రాకుండా చూసుకుంటుంది. 
 
బోధకాలుతో బాధపడేవారు తమలపాకులో కొద్దిగా ఉప్పు వేసి దంచి నీటిలో కలుపుకుని సేవిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది. అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. రోజూ ఒక ఆకును కొన్ని మిరియాలతో కలపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అది తిన్న వెంటనే చల్లని నీరు తాగాలి. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు తమలపాకు రసాన్ని తీసి కొద్దిగా ముక్కులో వేసుకుంటే సమస్య వెంటనే తగ్గుతుంది. 
 
తలలో చుండ్రు పోవాలంటే తమలపాకులను మెత్తగా రుబ్బి దానిని తాలకు పట్టించండి. కాసేపటి తర్వాత తలస్నానం చేయండి. అలా తరచుగా చేస్తుంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. అయితే సంతానం కోసం చూసేవారు తమలపాకు తొడిమను అస్సలు తినకండి, గర్భందాల్చలేకపోవచ్చు. మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే తరచూ తమలపాకుల రసాన్ని తాగుతూ ఉండండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments