Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లని పదార్థాలను పళ్లతో కొరికి తింటే... ఎనామిల్ ఏమవుతుంది?

పుల్లని పండ్లు, ఆహార పదార్థాలు తిన్నప్పుడు దంతాలు జివ్వున లాగడం, నమలడానికి సహకరించకపోవడం మనందరికి అనుభవమే. చింతకాయలు, రేగు పండ్లు, నిమ్మ, నారింజ, కలిమె కాయలు లాంటివి నోరూరించేలా చేస్తాయి. తీరా తిన్న తర్వాత పండ్లు జివ్వుమని లాగుతాయి. కొద్ది గంటలపాటు ద

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (20:08 IST)
పుల్లని పండ్లు, ఆహార పదార్థాలు తిన్నప్పుడు దంతాలు జివ్వున లాగడం, నమలడానికి సహకరించకపోవడం మనందరికి అనుభవమే. చింతకాయలు, రేగు పండ్లు, నిమ్మ, నారింజ, కలిమె కాయలు లాంటివి నోరూరించేలా చేస్తాయి. తీరా తిన్న తర్వాత పండ్లు జివ్వుమని లాగుతాయి. కొద్ది గంటలపాటు దేనిని నమల లేని పరిస్థతి. ఎందుకిలా జరుగుతుంది? పుల్లని పండ్లలో ఉండే ఆమ్లాలు మన దంతాల పైన రక్షణ కవచంగా ఉన్న ఎనామిల్‌ను కరగదీస్తాయి. ఎనామిల్ డ్యామేజి మొదలు కాగానే దంతాల్లోనిలో నాడులు ఇక పుల్లని పండ్లను నమలలేమని హెచ్చరిస్తాయి. 
 
ఆ వార్నింగే పళ్లు గోర్లు పోయాయనే భావన. మన దంతాలు డెంటిన్ అనే ఎముకతో తయారవుతాయి. ఇవి ఆమ్లాలు, క్షారాల ప్రభావానికి తేలికగా ధ్వంసమవుతాయి. మాంసాహారం లోని బొక్కలు, కొన్ని రకాల గింజలు, పప్పులు నమిలితే విరిగిపోతాయి. ఈ ప్రమాదం తప్పించేందుకు ప్రక్రుతి పళ్ల పైన ఎనామిల్ అనే తెల్లని పొరను ఏర్పరిచింది. ఎనామిల్ మన దేహంలోని అన్ని ఎముకల కంటే అత్యంత ధ్రుఢమైనది. ఈ ఎనామిల్ వల్ల దంతాలు గట్టిగా తయారవుతాయి. ఎనామిల్‌లో ప్రధానంగా క్యాల్షియం, ఫాస్ఫరస్ (Ca10(PO4)6(OH)2(s)) మూలకాలు బలమైన రసాయన బంధంతో కలిసిపోవడంతో, రోజువారి తినే ఆహారపదార్థాలతో చర్య జరగకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. 
 
చింతకాయలు, చింతపండులో ఉండే టార్టారిక్ యాసిడ్, నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం, రేగుపండ్లలోని ఆస్కార్బిక్ యాసిడ్, కూల్ డ్రింక్స్ లోని ఫాస్ఫారిక్ ఆమ్లం, కార్బోనిక్ యాసిడ్ లు ఎనామిల్ లోని క్యాల్షియం, ఫాస్ఫరస్ ల రసాయన బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దానితో ఎనామిల్ పొరలు పొరలుగా కరిగి పోయి పళ్లు పసుపు పచ్చగా మారతాయి. ఎనామిల్ పొర పల్చబడితే వేడి, చల్లని ద్రవాలు, పదార్థాలను తినడం బాధ కలిగిస్తుంది. ఎనామిల్ పోతుందని పుల్లని పండ్లను తినకుండా మానేస్తే శరీరానికి అవసరమైన సి విటమిన్, ఇతర పోషకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. 
 
ఈ ఫ్రూట్స్‌ను తినాలి, అయితే ఒకేసారి దొరికినన్ని కాకుండా తక్కువ తక్కువ తీసుకోవాలి. తిన్న ప్రతిసారి నీటితో నోరు శుభ్రం చేసుకుంటే ఆమ్లం ప్రభావం తగ్గుతుంది. నిమ్మ రసం, నారింజ జ్యూస్, కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు తప్పని సరిగా స్ట్రాను వాడాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత బ్రష్ చేసుకోకపోయినా ఎనామిల్ ధ్వంసమయ్య ప్రమాదం ఉంది. మనం ఆహారాన్ని నమిలినపుడు చిన్న తునకలు పళ్ల మధ్య ఇరుక్కుపోతాయి. నోటిలో ఉండే స్టెప్టోకాకస్ మ్యూటంట్స్, ల్యాక్టో బ్యాసిల్లి బ్యాక్టీరియాలు పిండి పదార్థం అవశేషాలను పులిసేలా చేస్తాయి. అప్పుడు వెలువడే ల్యాక్టక్ యాసిడ్ కూడా ఎనామిల్ పొరలను నాశనం చేస్తాయి. చిత్రమేమిటంటే ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నా క్రుత్రిమ ఎనామిల్ ఇప్పటికీ తయారు చేయలేకపోయారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments