Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి ఆకులు, రాళ్ల ఉప్పుతో జలుబుకు చెక్...

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (16:57 IST)
రుతువులు, కాలాలు మారే రోజుల్లో పలు రకాల వ్యాధులు ప్రబలుతాయి. వాటిలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎక్కువ మందికి సోకే వ్యాధి జలుబు. జలుబు పట్టిందంటే ఒక పట్టాన పోదు. అంతేకాకుండా అది అంటు వ్యాధి కావడంతో మన నుంచి ఇతరులకూ ప్రబలే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి జలుబు పట్టిందంటే అది త్వరగా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది. జలుబును అలక్ష్యం చేస్తే అనేర రకాల ఇన్‌ఫెక్షన్‌లు సోకే ప్రమాదం ఉంది. కనుక జలుబు విషయంలో అజాగ్రత్త పనికి రాదు. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
 
జలుబును తగ్గించడంలో తులసి బాగా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాయనాన్ని మింగడం ద్వారా జలుబు తీవ్రత తగ్గుతుంది. తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది. జిందా తిలిస్మాత్ జలుబుకు తక్షణ విరుగుడుగా పని చేస్తుంది. ప్రతి రోజూ మూడు పూటలా మూడు చుక్కల జిందా తిలిస్మాత్ ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా టీతో తీసుకుంటే జలుబు ఇట్టే తగ్గుతుంది.
 
జలుబు చేసినప్పుడు రాత్రి పూట పడుకునే ముందు వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే జలుబు తగ్గు ముఖం పడుతుంది. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి, బాగా మరిగించి...  తర్వాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే మంచిది. అదే విధంగా అల్లం ముక్కలను బాగా ఎండబెట్టి చూర్ణంలా చేసుకుని, దానికి కాస్త జీలకర్ర, పంచదార కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
 
జలుబు నుంచి రిలీఫ్ పొందినా.. దగ్గు మాత్రం అంత తొందరగా వదిలి పోదు. దగ్గును అరికట్టడంలో కరక్కాయ దివ్యౌషధంగా పని చేస్తుంది. కరక్కాయ ముక్కలను దవడ కింద ఉంచుకుని ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు నుంచి ఉపశపనం పొందవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments