Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు వున్నవారు గమనించాల్సిన విషయాలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (20:22 IST)
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని తీసుకోరాదు. ఐతే కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల హృద్రోగ సమస్యలు రాకుండా నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ మద్యం ఎక్కువగా తీసుకుంటే అది ప్రాణానికే ముప్పు తెస్తుంది.
 
మద్యం తీసుకోవడం వల్ల అప్పటికే ఉన్న రక్తపోటు స్థాయిని మరింత పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంగా రక్తనాళాలు పాడైపోవడం జరుగుతుంది. దీనితో చికిత్స కూడా క్లిష్టతరంగా మారుతుంది. పరిస్థితి ఇలా ఉండటం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. 
 
ఉప్పు తీసుకోవడం వల్ల కొందరిలో వెంటనే రక్తపోటు పెరిగిపోతుంది. ఐతే మరికొందరిలో అంతటి మార్పు కనబడదు. ఐతే బీపీ వున్నవారు ఉప్పు తీసుకోవడాన్ని ఖచ్చితంగా తగ్గించాల్సిందే. ఉప్పు తీసుకోవడం తగ్గించనట్లయితే రక్తపోటు పెరిగి అది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది.
 
కాబట్టి సోడియం స్థాయిని దాదాపు తగ్గించుకుంటే బీపీ రోగులకు ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే... ఒక స్థాయిని మించి రెండో స్థాయికి బీపీ చేరుకున్నదంటే అది మూత్రపిండాలను పాడు చేస్తుంది. కాబట్టి నియంత్రణ చాలా చాలా ముఖ్యం. తేలికగా తీసుకోరాదు.
 
కొవ్వు పదార్థాలను అధిక రక్తపోటు వున్నవారు దూరంగా పెట్టేయాలి. సాచ్యురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్-ఫ్యాట్లను ఖచ్చితంగా దూరంగా పెట్టేయాలి. ఇవి రెండూ గుండెకు, రక్త నాళాలను పాడు చేయడంలో ముందుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అధిక రక్తపోటు కారణంగా రక్త నాళాలు, గుండె ఎంతో ఒత్తిడికి గురై ఉంటాయి. ఈ స్థితిలో వాటిపై కొవ్వులు కూడా దాడి చేస్తే ఇక అన్నీ కలిసి ప్రాణం తీసేందుకు సిద్ధమైపోతాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఎర్ర మాంసం, వేరుశనగ పప్పు నూనె, నేయి... తదితర కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించాలి. అప్పుడే రక్తపోటును నియంత్రించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments